ETV Bharat / entertainment

రూ.2,950 కోట్లతో తమిళ ఇండస్ట్రీ టాప్​.. టాలీవుడ్​​ స్థానం ఎంతంటే?

ఇండియన్​ సినీ ఇండస్ట్రీలో సౌత్​ సినిమాల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆదాయం విషయంలోనూ మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 2022లో తమిళ ఇండస్ట్రీ అత్యధికంగా రూ.2,950కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. మరి టాలీవుడ్​ ఎంత ఆదాయం ఆర్జించిందంటే?

south cinema industry growth by a whopping 96 percent
రూ.2,950 కోట్లతో తమిళ ఇండస్ట్రీ టాప్​.. టాలీవుడ్​​ స్థానం ఎంతంటే?
author img

By

Published : Apr 26, 2023, 8:00 PM IST

గత కొంత కాలంగా ఇండియన్​ సినీ ఇండస్ట్రీలో సౌత్​ సినిమాల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దక్షిణాది చిత్ర పరిశ్రమ తనదైన శైలిలో ఆడియెన్స్​ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ దాదాపు ప్రతి చిత్రం.. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజవుతూ.. బాక్సాఫీస్​ ముందు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. 'బాహుబలి' చిత్రంతో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేయగా.. అప్పటినుంచి దక్షిణాది చిత్రసీమలో ఇదే ట్రెండ్​ కొనసాగుతోంది. ప్రాంతీయ, భాషా హద్దులను చెరిపేస్తూ.. కాసులు కొల్లగొడుతున్నారు సౌత్​ హీరోలు. మార్కెట్​ను పెంచుకుంటున్నారు మన దర్శక నిర్మాతలు. అలా 'కేజీయఫ్‌2', 'కాంతారా' 'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'పొన్నియిన్ సెల్వన్​', 'విక్రమ్​' చిత్రాలు.. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ముందూ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మలయాళంలోనూ కథాబలమున్న చిత్రాలు అలరిస్తున్నాయి. అలా మన సౌత్​ ఇండస్ట్రీ ఆదాయం విషయంలోనూ మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఒకప్పుడు రూ.100కోట్ల బెంచ్‌ మార్క్‌ ఉన్న మన దక్షిణాది చిత్రసీమ.. ఇప్పుడు రూ.1000కోట్లు లక్ష్యంగా థియేటర్లలోకి దూసుకొస్తున్నాయి. అయితే ఇదే సమయంలో మూస పద్ధతిలో ఆడియెన్స్​ ముందుకు వస్తున్న బాలీవుడ్‌ సినిమాలు మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. రీసెంట్​గా బాద్​ షా షారుక్ ఖాన్ 'పఠాన్​' మాత్రమే హిట్​ అయి వెయ్యి కోట్ల క్లబ్​లోకి వచ్చింది. బీటౌన్​కు కాస్త ఊపిరినిచ్చింది.

అయితే తాజాగా కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ(సీఐఐ) 2022లో దక్షిణాది చిత్ర పరిశ్రమ వృద్ధి గురించి నివేదికను విడుదల చేసింది. ఏకంగా 96శాతం వృద్ధి చెందినట్లు తాజా నివేదికలో పేర్కొంది. గతేడాది తమిళ ఇండస్ట్రీ అత్యధికంగా రూ.2,950కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపింది. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ రూ.2,500 కోట్ల ఆదాయాన్ని అందుకున్నట్లు వెల్లడించింది. కన్నడ రూ.1570 కోట్లు, మలయాళం రూ.816కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని నివేదికలో తెలిపింది. అలా 2022లో ఇండియన్​ ఇండస్ట్రీలో మొత్తంగా 1691 చిత్రాలు విడుదల కాగా.. సౌత్​లో 916 సినిమాలు విడుదలయ్యాయని తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా విడుదలైన సినిమాల్లో 54శాతంగా ఉందని పేర్కొంది.

రాబోయే రెండేళ్లలో.. ఇకపోతే వచ్చే రెండేళ్లలో దక్షిణాది ఇండస్ట్రీ నుంచి మరిన్ని భారీ, ఆసక్తికర సినిమాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. రామ్​చరణ్​ 'గేమ్‌ ఛేంజర్‌', NTR 30, మహేశ్‌-త్రివిక్రమ్‌ SSMB 28, ప్రభాస్‌ భారీ ప్రాజెక్ట్​లతో పాటు రజనీకాంత్​ 'జైలర్', కమల్​హాసన్​ 'ఇండియన్‌2', విజయ్​ దళపతి 'లియో'.. మరిన్ని చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ చిత్రాల ద్వారా ఆదాయం విషయంలో దక్షిణాది చిత్రసీమలు మరింత వృద్ధి చెందుతాయనే చెప్పాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: వెంకీ​.. మళ్లీ ఆ మిస్టేక్​ రిపీట్​ చేయొద్దు ప్లీజ్!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.