ETV Bharat / entertainment

Skanda Movie Box Office Collection : థియేటర్లలో పాన్ ఇండియా సినిమాల సందడి.. మూడో రోజు ఎంత వసూలు చేశాయంటే ? - స్కంద మూవీ డే 3 బాక్సాఫీస్​ కలెక్షన్స్

Skanda Movie Box Office Collection : ఎనర్జిటిక్​ స్టార్ రామ్- బోయపాటి కాంబినేషన్​లో వచ్చిన 'స్కంద' మూవీతో పాటు రాఘవ లారెన్స్​, కంగనా రనౌత్​ నటించిన 'చంద్రముఖి 2' సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో మూడో రోజు ఈ సినిమాలు బాక్సాఫీస్​ వద్ద ఎంత వసూలు చేశాయంటే ?

Skanda Movie Box Office Collection
Skanda Movie Box Office Collection
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 1:10 PM IST

Skanda Movie Box Office Collection : ఎనర్జిటిక్​ స్టార్ రామ్- బోయపాటి కాంబినేషన్​లో వచ్చిన లేటెస్ట్​ మూవీ 'స్కంద'. శ్రీలీల, సయీ మంజ్రేకర్​ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సెప్టెంబర్​ 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బోయపాటి మార్క్​తో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి టాక్ లభించింది. రామ్ ఊర మాస్​ లుక్​తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్​.. సినిమాలో హైలైట్​గా నిలిచాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా తొలి రెండు రోజులు మంచి వసూళ్లను అందుకోగా.. తాజాగా మూడో రోజు ఈ సినిమా రూ 5.3 కోట్లు సాధించింది.

Skanda Movie Cast : ఇక 'స్కంద' సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో రామ్​తో పాటు శ్రీ లీల, ప్రిన్స్‌ సిసిల్‌, సయీ మంజ్రేకర్, శరత్‌ లోహితాశ్వ, దగ్గుబాటి రాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా.. తమ్మిరాజు ఎడిటింగ్‌ బాధ్యతలు చేపట్టారు. సంతోష్‌ దేటేక్‌ సినిమాటోగ్రఫర్​గా వ్యవహరించదా.. శ్రీనివాస చిట్టూరి పవన్‌ కుమర్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Chandramukhi 2 Movie Collection : మరోవైపు ఈ సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్న రాఘవ లారెన్స్​ 'చంద్రముఖి-2' కూడా మంచి కలెక్షన్లు అందుకుంటోంది. తాజాగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి మూడో రోజు రూ. 5 కోట్లు సాధించిందని ట్రేడ్​ వర్గాల టాక్​. ఇక తొలి రెండు రోజులు ఈ సినిమా రూ.8.25 కోట్లు, రూ. 4.35 కోట్లు వసూళ్లు సాధించింది.

Chandramukhi 2 Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. 'చంద్రముఖి-1'కు సీక్వెల్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారెన్స్​, కంగనాతో పాటు వడివేలు, విఘ్నేష్, లక్ష్మీ మేనన్, సృష్టి డాంగే, మహిమా నంబియార్, రావు రమేష్, రవి మారియా, సురేశ్​ మీనన్, సుభిక్షా కృష్ణన్ కీలక పాత్రలు పోషించారు. భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీర‌వాణి సంగీతాన్ని అందించారు. ఇక ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ బాధ్యతలు చేపట్టారు. సాంగ్స్​తో పాటు ట్రైలర్​తో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే పెరిగాయి.

Skanda Movie Review : రామ్‌-బోయపాటి కాంబినేషన్‌ మెప్పించిందా?

Chandramukhi 2 Review : 'చంద్రముఖి -2'.. ప్రేక్షకులను భయపెట్టిందా ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.