ETV Bharat / entertainment

'బేషరమ్‌ రంగ్‌' దుమారం.. షారుక్​ స్ట్రాంగ్‌ కౌంటర్‌!

author img

By

Published : Dec 15, 2022, 10:29 PM IST

'బేషరమ్‌ రంగ్‌' పాట విషయంలో సోషల్​మీడియాలో విమర్శలపై కథానాయకుడు షారుక్​ తనదైన శైలిలో స్పందించారు. ఏమన్నారంటే?

sharukha khan
షారుఖ్‌

Besharam Song Controversy : ప్రేక్షకులు, అభిమానులు తమని ప్రేమిస్తున్నంత కాలం ప్రపంచం ఏమనుకుంటుంది? ఏం చేస్తుందన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'పఠాన్‌'. దీపిక పదుకొణె కథానాయిక. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి 'బేషరమ్‌ రంగ్' అంటూ సాగే ఓ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో హాట్‌ హాట్‌ అందాలతో దీపిక నటించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని, రద్దు సంస్కృతిని సానుకూల దృక్పథంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా వేదికగా జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో షారుఖ్‌ మాట్లాడారు.

"సోషల్‌మీడియా కొన్నిసార్లు సంకుచిత దృష్టికోణంతో చూస్తూ ఉంటుంది. కొంతమంది ప్రవర్తన అంతే. సోషల్‌మీడియా వినియోగం వల్ల నెగెటివిటీ పెరుగుతుందని నేను ఎక్కడో చదివాను. అలాంటివి పనులు మనుషుల మధ్య విభేదాలు సృష్టించి, నాశనం చేస్తాయి. కోల్‌కతా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లాంటివి సానుకూల దృక్పథాన్ని కల్పిస్తాయి" అని అన్నారు. 'పఠాన్‌'ను బాయ్‌కాట్‌ చేయాలని, దీపిక పదుకొణె హాట్‌ సన్నివేశాలను సరి చేయాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో షారుఖ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.