ETV Bharat / entertainment

యూకే వెళ్లేందుకు తిప్పలు - 25 ఏళ్ల తర్వాత రివెంజ్ - ఫ్యాన్స్​ను ఆకట్టుకుంటున్న 'డంకీ' ట్రైలర్​ - డంకీ మూవీ ట్రైలర్ అప్​డేట్​

Shahrukh Khan Dunki Trailer : బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​, తాప్సీ లీడ్​ రోల్స్​లో రూపొందిన తాజా మూవీ 'డంకీ'. ఇటీవలే విడుదలైన టీజర్​, సాంగ్స్​ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. మూవీ మేకర్స్​ ఇప్పుడు ట్రైలర్​ను నెట్టింట అప్​లోడ్​ చేశారు. మరి ఈ వీడియో ఎలా ఉందంటే ?

Etv BharatShahrukh Khan Dunki Trailer
Etv BharatShahrukh Khan Dunki Trailer
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 10:35 AM IST

Updated : Dec 5, 2023, 11:42 AM IST

Shahrukh Khan Dunki Trailer : బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​, తాప్సీ, విక్కీ కౌశల్​ లీడ్​ రోల్స్​లో రూపొందిన తాజా మూవీ 'డంకీ'. త్రీ ఇడియెట్స్​ డైరెక్టర్​ రాజ్​కుమార్​ హిరాణీ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్​ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్​ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను విడుదల చేశారు. సుమారు మూడు నిమిషాల నిడివిగల ఆ ట్రైలర్​ మూవీ లవర్స్​ను తెగ ఆకట్టుకుంటోంది. కడుపుబ్బా నవ్వించింది. కొన్ని సీన్స్​ భావోద్వేగానికి గురి చేసింది. షారుక్ ఖాన్ వాయిస్​ ఓవర్​తో వచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

'జవాన్​' లాగే ఈ సినిమాలోనూ
1995 బ్యాక్​ డ్రాప్​తో ఈ సినిమా తెరకెక్కనుంది. లాల్టు అనే ఊరికి షారుక్ ఎంట్రీ ఇవ్వడం నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆ ఊరిలో ఉండే నలుగురు స్నేహితులు ఎలాగైనా లండన్ వెళ్ళాలని అనుకుంటారు. దాని కోసం ఇంగ్లీష్​ కోచింగ్​ క్లాస్​ కూడా జాయిన్ అవుతారు. వీరితో పాటు రెజ్లర్​ అయిన షారుక్ కూడా జాయిన్​ అవుతారు, అయితే అధికారికంగా వెళ్లాలంటే ఇంగ్లీష్ రావాలని వారికి అర్ధమవుతుంది. కానీ ట్రై చేసినా వీసా ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. దీంతో ఎలాగైనా లండన్ వెళ్లాలనుకున్న ఆ ఐదుగురు ఒక ప్లాన్ వేస్తారు. అలా అక్రమంగా దేశాలను దాటూతూ లండన్ ఎలా వెళ్తారు. అయితే వాళ్లు అలా వెళ్లగలిగారు? ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది మిగతా స్టోరీగా ఉండనున్నట్లు ట్రైలర్​ ద్వారా తెలుస్తోంది. అయితే ఇందులో కామెడీతో పాటు ఎమోషనల్​ సీన్స్​ ఉన్నాయి. ఇక జవాన్​ లాగే ఈ సినిమాలోనూ షారుక్​ వివిధ లుక్స్​లో కనిపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Dunki Movie Cast : ఇక ఈ సినిమాలో షారుక్ సరసన తాప్సీ నటిస్తున్నారు. అనిల్ గ్రోవర్, బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్, కీలక పాత్రలు పోషించారు. 'మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్', 'లగేరహో మున్నాభాయ్', 'త్రీ ఇడియట్స్', 'పీకే', 'సంజూ' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలను తెరకెక్కించిన రాజ్‌కుమార్ హిరానీ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్​ అందుకుంటారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Last Updated : Dec 5, 2023, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.