అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న షారుక్ ఖాన్-అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి టైటిల్ అనౌన్స్మెంట్ చేశారు. 'జవాన్' పేరుతో రూపొందుతున్న ఈ మూవీలో షారుక్ రఫ్ లుక్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ వీడియో ఆద్యంతం పవర్ఫుల్ యాక్షన్ సీన్స్తో ఆకట్టుకుంటోంది. సినిమాపై భారీగా అంచనాలను పెంచుతోంది. కాగా, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2023 జూన్ 2న హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది మూవీటీమ్.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనున్న నయనతార ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. షారుక్ ఓ పాత్రలో 'రా' అధికారిగా, మరో పాత్రలో గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. నాలుగేళ్ల నుంచి షారుక్ తెరపై కనపడకపోవడంతో ఈ సినిమా కోసం బాద్‌షా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక షారుక్ ఈ మూవీతో పాటు 'రాకెట్రీ', 'లాల్ సింగ్ చద్ధా', 'బ్రహ్మాస్త్ర', 'టైగర్ 3'లో అతిథి పాత్రలో మెరవగా.. 'డంకీ', 'పఠాన్' సినిమాల్లో నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : పవన్ మూవీ నుంచి పూజా ఔట్.. చరణ్ కొత్త సినిమా కోసం అనిరుధ్!