ETV Bharat / entertainment

ఇదెక్కడి అభిమానమో.. చిన్న విషయానికే ట్రెండింగ్‌లోకి షారుక్! - షారుఖ్​ ట్రెండింగ్​

Shahrukhkhan: బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్​ నటిస్తున్న సినిమాలకు సంబంధించి ఎలాంటి ఫొటో వచ్చినా. క్షణాల్లో వైరల్‌ అవుతూ సోషల్​మీడియాలో దూసుకుపోతుంది. తాజాగా మరోసారి షారుక్ పేరు సోషల్‌ మీడియాలో మారుమోగిపోతోంది. ఇందుకు కారణం సినిమా అప్డేట్​ కాదు.. కేవలం బాలీవుడ్​ కింగ్​ ఖాన్​ తన ఇంటి నేమ్‌ ప్లేట్‌ మార్చడమే.

Shah rukh khan mannat name plate change
Shah rukh khan mannat name plate change
author img

By

Published : Apr 24, 2022, 10:55 PM IST

Shahrukhkhan House Name Plate Trending: బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుక్​కు మార్కెట్‌లో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. వెండితెరపై ఆయన్ని చూసేందుకు సుమారు మూడేళ్ల నుంచి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో షారుక్, ఆయన చేస్తున్న సినిమాలకు సంబంధించి ఎలాంటి టాపిక్‌ బయటకు వచ్చినా.. అది వెంటనే సోషల్‌మీడియా ట్రెండింగ్‌లోకి వెళ్లిపోతుంది. కానీ, తాజాగా ఎలాంటి అప్‌డేట్‌ లేకపోయినప్పటికీ కేవలం ఒక్క చిన్న విషయంతో ఆయన పేరు సోషల్‌మీడియాలో దూసుకెళ్లింది. ట్రెండింగ్‌కి కారణమైన విషయమేమిటంటే.. షారుక్ ఇంటి నేమ్‌ ప్లేట్‌ మార్చడం.

Shah rukh khan mannat name plate change
షారుఖ్​ ఖాన్​ 'మన్నత్​'

ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పుకొనే బాంద్రాలో షారుక్ ఖాన్‌కు భవంతి ఉంది. తమ అభిరుచులకు అనుగుణంగా షారుక్, ఆయన సతీమణి గౌరీ ఖాన్‌ ఈ ఇంటిని డిజైన్‌ చేయించుకున్నారు. ఈ ఇంటికి 'మన్నత్‌' అని పేరు పెట్టారు. సుమారు రూ.200 కోట్లు విలువచేసే ఈ ఇంటిలో 2001 నుంచి షారుక్ నివాసం ఉంటున్నారు. ఇప్పటివరకూ ఆ ఇంటి నేమ్‌ ప్లేట్‌ను పలుమార్లు మార్చారు. ఈక్రమంలోనే తాజాగా మరోసారి కొత్త డిజైన్‌తో 'మన్నత్‌' నేమ్‌ ప్లేట్‌ని మార్చారు. ఈ ఫొటోలు నెట్టింట్లో దర్శనమివ్వడంతో వైరల్‌గా మారాయి. అలా, 'షారుక్ ఖాన్‌', 'మన్నత్‌' ట్రెండింగ్‌లోకి చేరాయి. అది చూసిన పలువురు నెటిజన్లు.. "ఇదెక్కడి అభిమానమో.." అని కామెంట్లు చేస్తున్నారు.

ఇవీ చదవండి: దుబాయ్​లో రాజమౌళి, మహేష్.. కథపై చర్చలు అక్కడే!

బాలయ్య- బోయపాటి కొత్త చిత్రం.. ఆ కండిషన్ పెట్టిన నటసింహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.