Shah rukh khan injured : 'పఠాన్' సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రస్తుతం గాయపడినట్లు తెలుస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా బాద్ షా ప్రమాదానికి గురయ్యారని సమాచారం అందింది. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు గాయమైందని కథనాలు వస్తున్నాయి. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారట. దీంతో షారుక్.. ప్రస్తుతం భారత్‌కు తిరిగి వచ్చారని.. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని అంటున్నారు. మరి ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు.
Sharukh khana Jawaan movie : ఇకపోతే ప్రస్తుతం షారుక్.. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'జవాన్'లో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో షారుక్ సరసన నయనతార నటిస్తోంది. ఇంకా మూవీలో విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గెస్ట్ రోల్లో కనిపించనుంది. సంజయ్ దత్ విలన్ రోల్ పోషిస్తున్నారు. వీరిద్దరి మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయట. ఇక ఈ ప్రాజెక్ట్‌తో పాటు బాద్ షా.. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌లో రానున్న 'డంకీ' లోనూ నటిస్తున్నారు. ఇందులో తాప్సీ హీరోయిన్. మరి ఈ రెండు చిత్రాల్లో.. ఏ షూటింగ్లో ఆయన గాయపడ్డారు క్లారిటీ లేదు.
ఇకపోతే 2018లో 'జీరో' సినిమాతో డీలా పడిన షారుక్ ఖాన్ ఆ తర్వాత.. ఈ ఏడాది 'పఠాన్ ' సినిమా గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా రూ.1000కోట్లకు పైగా వసూళ్లను అందుకుని బాలీవుడ్‌కు ఊపిరిపోసింది. ఇందులో భారీ స్థాయిలో ఉన్న యాక్షన్ సన్నివేశాలను సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. అలా ఈ చిత్రం ఇచ్చిన జోష్‌తో ఇప్పుడు జవాన్, డంకీలో నటిస్తున్నారు. ఇవి కూడా భారీ హిట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతందో..
ఇదీ చూడండి :
మన్నత్పై షారుక్ ఐకానిక్ పోజ్.. 300 మంది ఫ్యాన్స్ రీక్రియేట్.. గిన్నిస్ రికార్డ్ వచ్చిందోచ్!