ETV Bharat / entertainment

'ఆచార్య' డబుల్​ ట్రీట్​.. థియేటర్స్​లో 'సర్కారు వారి పాట' ట్రైలర్​! - acharya release date

Sarkaru vaari paata trailer: 'సర్కారు వారి పాట' ట్రైలర్​ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్​ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచార చిత్రాన్ని 'ఆచార్య' సినిమా రిలీజ్ రోజున థియేటర్లలో విడుదల​ చేస్తారని సమాచారం.

Sarkaru vaari pata trailer in Acharya movie theatres
ఆచార్య థియేటర్స్​లో సర్కారు వారి పాట ట్రైలర్​
author img

By

Published : Apr 26, 2022, 9:56 AM IST

Sarkaru vaari paata trailer: ఈ మధ్య కాలంలో ఓ స్టార్​ హీరో సినిమాను మరో ప్రముఖ హీరో ప్రమోట్​ చేయడం చూస్తునే ఉన్నాం. దీంతో అగ్రహీరోల మధ్య ఉన్న స్నేహబంధాన్ని చూసి సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, రామ్​చరణ్​ కలిసి నటించిన 'ఆచార్య' సినిమాకు సూపర్​స్టార్​ మహేశ్​ బాబు వాయిస్​ ఓవర్​ ఇచ్చారు. దీంతో అటు మెగాఫ్యాన్స్​, ఇటు సూపర్​స్టార్​ ఫ్యాన్స్​ తెగ సంబరపడిపోయారు. ఇప్పుడు వీరి ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు ఇరు చిత్రబృందాలు కలిసి మరో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మే 29 'ఆచార్య' సినిమా రిలీజ్​ రోజున థియేటర్లలో 'సర్కారు వారి పాట' ట్రైలర్​ను విడుదల​ చేయాలని మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారట! ప్రస్తుతం ఈ విషయమై వరుస కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అభిమానులకు ఇక పండగే.

కాగా, 'ఆచార్య' విషయానికొస్తే.. దేవాలయాల ప్రాముఖ్యత, వాటిని అడ్డుపెట్టుకుని కొంతమంది చేసే అవినీతిని చూపించే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకుడు. చిరు, చరణ్​, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక 'సర్కారు వారి పాట' విషయానికొస్తే.. బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో దీన్ని రూపొందించారు. కీర్తి సురేశ్​ హీరోయిన్​. పరశురామ్​ దర్శకుడు.

ఇదీ చూడండి: Sarkaru Vaari Paata: 'అది చూసి అంతా నిజం అని అనుకున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.