Sankranti Movies Ticket Price: టాలీవుడ్లో సంక్రాంతి పండగ సినీ ఇండస్ట్రీకి ఓ సెంటిమెంట్. పొంగల్ ఫెస్టివల్‌ను క్యాష్ చేసుకునేందుకే మూవీమేకర్స్ ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది 3-4 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలో నిలుస్తాయి. అలాగే ఈసారి 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్', 'నా సామిరంగ' సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాల టికెట్లు రేట్ పెంపునకు రెండు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో ఆయా సినిమాలకు సింల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌లలో ధరలు ఎలా ఉన్నాయంటే.
గుంటూరు కారం: ఈ సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో గంటూరు కారంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈనెల 12 నుంచి 18 తేదీ వరకు తెలంగాణలో టికెట్ రేట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ.100, ఆంధ్రప్రదేశ్‌లో రూ.50 పెరగనున్నాయి.ఈ లెక్కన తెలంగాణలో మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్ ధర రూ.410 ఉండగా, సింగిల్ స్క్రీన్లలో రూ.250 గా ఉంది. ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్‌లో రూ.200, మల్టీప్లెక్స్‌లలో రూ. 230గా ఉంది.
హనుమాన్: హై క్వాలిటీ విజువల్స్‌తో తెరకెక్కిన హనుమాన్ సినిమా కూడా, గుంటూరు కారంతోపాటుగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై బజ్ విపరీతంగా పెరింగింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరందుకున్నాయి. ఇక తెలంగాణ మల్టీప్లెక్స్‌లలో రూ.295 ఉండగా, సింగిల్ స్క్రీన్లలో రూ.150 ఉంది. అటు ఏపీ మల్టీప్లెక్స్‌లలో రూ.175 ఉండగా, సింగిల్ స్క్రీన్లలో రూ.100-150 ఉంది.
నా సామి రంగ, సైంధవ్: విక్టరీ వెంకటేశ్ 75వ సినిమా 'సైంధవ్' సినిమాకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ఈ సినిమాకు తెలంగాణ మల్టీప్లెక్స్‌లలో రూ.295 ఉండగా, సింగిల్ స్క్రీన్లలో రూ.175 ఉంది. ఈసినిమా జనవరి 13న రానుంది. ఇటు నా సామి రంగ సినిమాకు కూడా టికెట్ ప్రైజ్ దాదాపు ఇదే రేంజ్లో ఉంది. తెలంగాణ మల్టీప్లెక్స్‌లలో రూ.295 ఉండగా, సింగిల్ స్క్రీన్లలో రూ.175 ఉంది. ఇక ఈ రెండు సినిమాలకు ఏపీలో ఇంకా బుకింగ్స్ ప్రారంభం కాలేదు.
వీటికి అదనం! మల్టీప్లెక్స్‌లలో రిక్లైనర్ (Recliner Chair), సింగిల్ స్క్రీన్లలో బాల్కనీ (Balcony Seat) సీట్లకు కాస్త ఎక్కువ ఛార్జ్ ఉండనుంది. ఇక ఆన్లైన్ (Online Ticket Booking Movie)లో టికెట్ బుక్ చేసుకుంటే బేస్ ప్రైజ్‌కు రూ.30-40 అదనంగా ప్లాట్‌ఫామ్ ఫీ చెల్లించాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గుంటూరు కారం : అప్పుడేమో రొమాంటిక్‌గా - ఇప్పుడేమో తల్లి కొడుకులుగా!
హలీవుడ్ మూవీతో హనుమాన్ పోటీ - అక్కడ తొలి తెలుగు చిత్రంగా రికార్డ్!