ETV Bharat / entertainment

​కొత్త వెబ్​సిరీస్ కోసం సామ్​ 'స్పెషల్​' ట్రైనింగ్​.. షూటింగ్​ అప్పుడే! - samantha webseries

'ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్​ సమంత తాజాగా 'సిటాడెల్‌ ఇండియా' వెబ్‌ సిరీస్‌లో నటించనుంది. అయితే ఈ సిరీస్​ 1990ల నేపథ్యంలో సాగుతోందని తెలుస్తోంది. ఆ వివరాలు..

samantha-varun-dhawan-starrer-new-movie-shoot-will-start-from-november

author img

By

Published : Oct 8, 2022, 7:44 AM IST

స్టార్​ హీరోయిన్​ సమంత కెరీర్‌ జోరుగా సాగుతోంది. ఓ పక్క సినిమాలు..మరో పక్క వెబ్‌ సిరీస్‌లతో తీరిక లేకుండా గడుపుతోంది. 'ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్న ఈ భామ తాజాగా 'సిటాడెల్‌ ఇండియా' వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని పాత్ర కోసం సమంత ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. హిందీ భాషలోని యాస కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సిరీస్‌ 1990ల నేపథ్యంలో సాగుతోందని తెలుస్తోంది. ఈ సిరీస్‌ చిత్రీకరణ కోసం చిత్రబృందం ప్రత్యేక నవంబరు తొలివారంలో వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. నవంబరు చివర్లో కానీ డిసెంబరు తొలివారంలో కానీ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. రుస్సో బ్రదర్స్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ వివిధ దేశాల్లో, వివిధ భాషల్లో రూపొందనుంది. సిటాడెల్‌ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మేడెన్‌ నటిస్తున్నారు. వరుణ్‌ధావన్‌ కీలక పాత్రలో నటిస్తున్న 'సిటాడెల్‌ ఇండియా'కు రాజ్‌, డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవీ చదవండి: సూపర్​ 'జోడీలు' ఫిక్స్​.. సినిమాల కోసం ఫ్యాన్స్​ వెయిటింగ్​!

వెట్రిమారన్‌, కమల్‌ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. భాజపా నేతలు ఫైర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.