ETV Bharat / entertainment

ఎట్టకేలకు అనారోగ్యంపై స్పందించిన సామ్​.. సెలైన్​ పెట్టుకుని మరీ వర్క్​ చేస్తూ.. - సమంత ఆరోగ్య సమస్య

ఎట్టకేలకు తాను ఏ సమస్యతో బాధపడుతుందో తెలిపింది స్టార్​ హీరోయిన్ సమంత. తనకొచ్చిన వ్యాధి ఏంటో చెప్పింది. ఈ విషయంపై ఓ ఫొటో పోస్ట్ చేస్తూ సుదీర్ఘమైన లేఖను రాసుకొచ్చింది. ఇంతకీ సమంత ఏమందంటే..

samantha shares his health problems with photo
ఎట్టకేలకు అనారోగ్యంపై స్పందించిన సామ్
author img

By

Published : Oct 29, 2022, 4:19 PM IST

Updated : Oct 29, 2022, 6:44 PM IST

సమంత అనారోగ్యంతో బాధపడుతున్నారని, అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై సామ్‌ స్పందించింది. తాను నటించిన 'యశోద' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోను షేర్‌ చేస్తూ సుదీర్ఘ పోస్ట్‌ చేశారు. ఆ ఫొటోలో సమంత చేతికి సెలైన్‌ ఉండటం గమనార్హం.

"యశోద ట్రైలర్‌కు మీ స్పందన చాలా బాగుంది. జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలల నుంచి "మయోసిటిస్‌" అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. కాస్త ఆలస్యమైనా ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. ఇక మరొక్క రోజు కూడా ఇలా ఉండలేను. ఎలాగో క్షణాలు గడుస్తున్నాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఐ లవ్‌ యూ" అని సమంత ట్వీట్‌ చేశారు.

గత కొంతకాలంగా అటు, సినిమాలకు, ఇటు సోషల్‌మీడియాకు దూరంగా ఉంటున్నారు సమంత. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వచ్చిన వార్తలపైనా స్పందించలేదు. తాజాగా "యశోద"గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తన అనారోగ్యం గురించి సమంత స్వయంగా వెల్లడించడం గమనార్హం. మరోవైపు విజయ్‌ దేవరకొండతో కలిసి "ఖుషి" చిత్రంలోనూ సామ్‌ నటిస్తున్నారు. శివ నిర్వాణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా, సామ్​ చేసిన తాజా ప్రకటనతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక ఈ విషయంపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా సమంత త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేశారు. "త్వరగా కోలుకోవాలి.. మీకు ఆ ధైర్యాన్ని పంపుతున్నా" అంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి జనతా గ్యారేజ్‌, రామయ్య వస్తావయ్యా, బృందావనం, రభస లాంటి పలు చిత్రాల్లో సమంత నటించింది.

  • Get well soon Sam. Sending you all the strength.

    — Jr NTR (@tarak9999) October 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి : సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి వెళ్లనున్న జూనియర్ ఎన్టీఆర్

'సమంతతో ప్రేమలో పడ్డా.. ఇప్పుడైతే ఏకంగా..'.. విజయ్ షాకింగ్ ట్వీట్!

Last Updated : Oct 29, 2022, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.