ETV Bharat / entertainment

'ఆరోగ్యం దెబ్బతింది, సినిమాలు ఫ్లాప్, విడాకుల సమస్య'- సమంత ఎమోషనల్ - యాక్టింగ్​పై సమంత కామెంట్స్

Samantha Latest Interview :టాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ సమంత తాజాగా ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఒకేసారి చుట్టుముట్టడం వల్ల తాను ఎంతో కుంగిపోయినట్లు పేర్కొన్నారు.

Samantha Latest Interview
Samantha Latest Interview
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 12:38 PM IST

Updated : Nov 9, 2023, 12:46 PM IST

Samantha Latest Interview : టాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇచ్చిన ఆమె.. తన టైమ్​ను రిలాక్సేషన్​తో పాటు మయోసైటిస్​ ట్రీట్​మెంట్​ కోసం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆంగ్ల మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఒకేసారి చుట్టుముట్టడం వల్ల తాను ఎంతో కుంగిపోయినట్లు అందులో పేర్కొన్నారు.

"ఒకవైపు నా ఆరోగ్యం దెబ్బతింటుంటే.. మరోవైపు నా వైవాహిక బంధం కూడా ముగిసింది. అదే సమయంలో నేను నటించిన సినిమాలకు కూడా అంతగా ప్రేక్షకాదరణ లభించలేదు. దీంతో నేను ఎంతో బాధపడ్డాను. గత రెండు సంవత్సరాలుగా నేనెంతో కుంగుబాటుకు గురయ్యానో మాటల్లో చెప్పలేను. ఆ సమయంలో ఎంతోమంది నటీనటుల గురించి చదివాను. వారి ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు, ట్రోల్స్​ను ఎలా తట్టుకున్నారన్న విషయాలను తెలుసుకున్నాను. వాళ్ల గురించి చదవడం నాకెంతో సహాయపడింది. వారు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలననే ధైర్యం నాకు వచ్చింది. అదే నాకు బలాన్ని ఇచ్చింది" అని సమంత తెలిపారు.

మరోవైపు తన సినిమాలతో పాటు తన కెరీర్​ గురించి మాట్లాడారు. ఓ నటిగా ఇంతమందిలో గుర్తింపు పొందడం ఎంతో గొప్ప అదృష్టమని సామ్​ అన్నారు.

" ఒక నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది అందమైన బహుమతి. అందుకే నటిగా నా బాధ్యతను నిర్వర్తించడంలో నేను ఎంతో నిజాయితీగా ఉంటాను. నటీనటుల జీవితాలంటే ఎప్పుడూ సినిమాల ఫలితాలు, అవార్డులు, వాళ్ల దుస్తులు మాత్రమే కాదు. వాళ్లకు కూడా ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. నా ఒడుదొడుకులు అందరికీ తెలిసినందుకు నేనేం బాధపడను. నాలాంటి వాళ్లు ఇంకా ఎంతో మంది ఉన్నారు. వారంతా నాలాగే పోరాడే శక్తిని పొందాలని నేను ఆశిస్తున్నాను" అని సమంత భావోద్వేగానికి లోనయ్యారు.

భూటాన్​లో ట్రీట్​మెంట్​..
మరోవైపు సమంత తాజాగా భూటాన్​కు పయనమయ్యారు. గత కొంతకాలంగా ఆమె మయోసైటిస్​కు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రకరకాల థెరపీలను ట్రై చేస్తున్న సామ్​.. ఇటీవలె క్రయోథెరపీ అనే ఆయుర్వేద చికిత్స తీసుకున్నారు. దీంతో పాటు డాట్‌షో (హాట్ స్టోన్ బాత్) అనే ఆయుర్వేద చికిత్సను తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఇన్​స్టా వేదికగా ఫ్యాన్స్​తో పంచుకున్నారు.

Samantha Health Condition : హాస్పిటల్​కు సమంత.. అలా చేస్తేనే తనకు శక్తి పెరుగుతుందంటూ పోస్ట్​

సమంత హెల్త్ అప్డేట్​ -150 డిగ్రీల చలిలో ట్రీట్మెంట్​

Last Updated : Nov 9, 2023, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.