ETV Bharat / entertainment

సామ్​ కొత్త మూవీ ట్రైలర్​ రిలీజ్..'కేజీయఫ్​ 2'పై చెర్రీ​ కామెంట్స్​ - చరణ్​ ట్వీట్​

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత లేటెస్ట్​గా నటించిన 'కాతువాకుల రెండు కాదల్'​ సినిమా తెలుగు ట్రైలర్​ను మేకర్స్​ రిలీజ్​ చేశారు. మరోవైపు, కేజీయఫ్​2 సినిమాపై మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​, బాలీవుడ్​ నటుడు సంజయ్​దత్​ ప్రశంసల జల్లు కురిపించారు.

RAMCHARAN KGF TWEET SAMANTA
RAMCHARAN KGF TWEET SAMANTA
author img

By

Published : Apr 23, 2022, 6:37 PM IST

Kaathu Vaakula Rendu Kaadhal Telugu Trailer Released: టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత, లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం 'కాతువాకుల రెండు కాదల్‌.' ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తమిళం, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేయగా.. తెలుగు ట్రైలర్‌ను శనివారం రిలీజ్‌ చేశారు. తెలుగులో 'కన్మణి రాంబో ఖతీజ' పేరుతో థియేటర్లలో విడుదల కానుంది. అనిరుధ్ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రౌడీ పిక్చర్స్‌, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. కన్మణిగా నయనతార, ఖతీజ పాత్రలో సమంత.. ఇక రాంబోగా విజయ్ సేతుపతి కామెడీ పండించనున్నారు. ట్రైలర్‌లో ఈ ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వించేలా ఉన్నాయి.

Ramcharan Comments On KGF 2 Movie: కన్నడ హీరో యశ్‌ నటించిన 'కేజీయఫ్‌2' వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ సినిమాపై సినీ అభిమానులే కాదు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగా హీరో రామ్‌చరణ్‌ ఈ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్​మీడియా వేదికగా ట్వీట్​ చేశారు.

''కేజీయఫ్‌2' సినిమా భారీ విజయాన్ని సాధించినందుకు టీమ్‌ అందరికీ అభినందనలు. ఈ సినిమాలో రాఖీభాయ్‌గా యశ్‌ అద్భుతంగా నటించారు. ఆయన నటన చూశాక మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా, రావు రమేశ్‌ నటన అత్యద్భుతంగా ఉంది. అలాగే ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్‌ అందరికీ అభినందనలు' అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. శుక్రవారం ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ కూడా కేజీఎఫ్​ 2 చిత్రాన్ని ప్రశంసిస్తూ ట్వీట్​ చేశారు.

Sanjay Dutt On KGF 2 Movie Success: 'కేజీయఫ్‌-2' సినిమాలో అధీరాగా భయంకరమైన విలన్‌ పాత్రలో నటించిన బాలీవుడ్​ నటుడు సంజూభాయ్ ఆకట్టుకున్నారు. ఈ సినిమా విజయంపై తాజాగా స్పందించారు. తనను ఆదరించిన ప్రేక్షకులు, కుటుంబ సభ్యులు, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

"కొన్ని సినిమాలు మనకెంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. నేనెప్పుడూ నన్ను నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు తెచ్చే సినిమా కోసం వెతుకుతుంటాను. 'కేజీయఫ్-2' నాకు అలాంటిదే. ఈ సినిమా నా సామర్థ్యాన్ని మరోసారి నాకు తెలియజేసింది. జీవితం ఎప్పుడూ ఏదో ఒక సర్‌ప్రైజ్‌ను అందిస్తుంది. దాన్ని గొప్పగా మలుచుకోవడం మన చేతిలోనే ఉంటుంది. సినిమాను ప్యాషన్‌ అని ఎందుకంటారో నాకు కేజీయఫ్‌తో అర్థమైంది. అధీరా పాత్రను దర్శకుడు పూర్తిగా నాకు అప్పగించారు. నాకందిన ప్రశంసల క్రెడిట్ మొత్తం ఆయనదే. మేము తెరపై కనిపించిన తీరు దర్శకుడి కల. కేజీయఫ్ నాకెప్పుడూ ప్రత్యేకమే' అంటూ ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి'
నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి'
రాజశేఖర్​ 'శేఖర్​' చిత్రం
రాజశేఖర్​ 'శేఖర్​' చిత్రం
శ్రీదేవి శోభన్​ బాబు ట్రైలర్​
శ్రీదేవి శోభన్​ బాబు ట్రైలర్​

ఇవీ చదవండి: దేశం ప్రశాంతంగా ఉందంటే వారే కారణం: రామ్​చరణ్​

'నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు.. స్టూడియోలో ఫ్లోర్స్ క్లీన్‌ చేశా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.