ETV Bharat / entertainment

అతిథి పాత్ర కాదు.. అంతకుమించి.. ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండానే.. - suriya rolex role remuneration

వేరే హీరోల సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసిన అగ్రనటులు చాలామందే ఉన్నారు. అయితే అందులో కొందరు అభిమానంతో చేస్తే.. మరి కొందరు రెమ్యునరేషన్​ కోసం పనిచేస్తారు. అలా ఈ ఏడాది కేవలం అభిమానంతోనే ఒక్క రూపాయి రెమ్యునరేషన్​ కూడా తీసుకోకుండా మరో హీరో చిత్రం కోసం పని చేసిన నటులెవరో తెలుసుకుందాం..

Heroes No Remuneration
రెమ్యునరేషన్​ లేకుండా అతిథి పాత్రల్లో నటించిన హీరోలు
author img

By

Published : Dec 27, 2022, 3:19 PM IST

ఓ హీరో చిత్రంలో మరి కథానాయకుడు అతిథి పాత్రలో మెరవడం మనం చూస్తునే ఉంటాం. కేవలం మెరవడం మాత్రమే మరి కొన్ని సందర్భాల్లో పాటలు పాడటం, వాయిస్ ఓవర్​ అంటూ గాత్ర దానం కూడా చేస్తుంటారు. ఇదంతా సహ నటులు, దర్శకులతో ఉన్న స్నేహం, అభిమానంతోనే, సినిమాకు హైప్​ పెంచాలనో ఇలా చేస్తుంటారు. అలానే ఈ ఏడాది కూడా వచ్చిన చిత్రాల్లో కొందరు స్టార్ హీరోలు మరో కథానాయకుల చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్​తో మెప్పించారు. ఇంకొంతమంది అలరించేందుకు సిద్ధమయ్యారు. అయితే దీని కోసం వారు కనీసం ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. మరి వారెవరో చూద్దాం.

వారిసు కోసం మరోసారి.. తమిళ స్టార్​ హీరో శింబు.. సింగర్​ కూడా అన్న విషయం తెలిసిందే. చాలా సార్లు మరో హీరో చిత్రానికి స్పెషల్​ సాంగ్స్​ పాడుతుంటారు. అలా ఈ సారి మరో ప్రముఖ హీరో దళపతి విజయ్​ నటిస్తున్న 'వారిసు' కోసం ఓ మాస్ సాంగ్​ పాడారు. 'తీ దళపతి' పాటను ఆలపించారు. ఇటీవలే విడుదలైన ఈ పాట మాస్ ఆడియెన్స్​ను ఉర్రూతలూగించింది. అయితే ఈ పాట పాడినందుకు ఆయన ఒక్క రూపాయి రెమ్యునరేషన్​ కూడా తీసుకోలేదని తెలిసింది. ఏమి ఆశించకుండా ఫ్రీగా పని చేశారట. హీరో విజయ్​తో తనకున్న స్నేహంతోనే ఇలా చేశారు. కాగా, ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్​రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి 12న పాన్ ఇండియా లెవల్​లో విడుదల కానుంది.

దళపతి విజయ్.. హీరో విజయ్ కూడా బాలీవుడ్ బాద్​ షా నటిస్తున్న షారుక్​ ఖాన్ జవాన్​లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. అట్లీతో మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ పాత్ర కోసం ఆయన ఎలాంటి పారితోషికం తీసుకోవట్లేదట.

అటు​ విలన్​గా.. ఇటు జర్నలిస్ట్​గా.. విలక్షణ నటుడు సూర్య ఈ ఏడాది రెండు చిత్రాల్లో గెస్ట్ రోల్స్​లో కనువిందు చేశారు. అందులో ఒకటి మాధవన్ నటించిన బ్లాక్ బస్టర్​ మూవీ 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్​'​. ఇందులో సూర్య జర్నలిస్ట్​గా కనిపించారు. ఇకపోతే సూర్య ఈ ఏడాది మంచి పేరు తీసుకొచ్చిన పాత్ర 'రోలెక్స్​'. యూనివర్సల్​ స్టార్ కమల్​హాసన్​ నటించిన సూపర్​ హిట్ చిత్రం విక్రమ్​. ఈ చిత్ర క్లైమాక్స్​లో కనిపించింది కేవలం ఐదు నిమిషాలే అయినా పవర్​ఫుల్​ విలన్​గా సూర్య తన లుక్స్​, యాక్టింగ్​తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్​ చేసేశారు. అందరూ తన గురించి మాట్లాడుకునేలా భయపెట్టేశారు. అయితే ఈ రెండు చిత్రాల కోసం సూర్య ఒక్క రూపాయి ఆశించకుండానే కేవలం అభిమానంతో చేశారు.

అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్​లో.. బాలీవుడ్​ భాయ్​ సల్మాన్​ ఖాన్​కు.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే చిరు నటించిన 'గాడ్ ఫాదర్‌'లో ఓ పవర్​ఫుల్​ రోల్​ చేశారు. ఆ కాసేపు అదిరిపోయే యాక్షన్​ సీన్స్​తో అదరగొట్టేశారు. ఈ చిత్రం కోసం భాయ్​ రెమ్యునరేషన్​ తీసుకోలేదని స్వయంగా చిరునే చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.