Salman Khan Pawan Kalyan: 'గబ్బర్‌సింగ్', 'గద్దలకొండ గణేశ్' చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు హరీశ్ శంకర్. ప్రస్తుతం ఆయన 'భవదీయుడు భగత్‌సింగ్' స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఇది తెరకెక్కనుంది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఓ ఆసక్తికర విషయం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ఈ చిత్రంలో నటించనున్నారని.. ఈ విషయంపైనే ఇటీవల హరీశ్ ముంబయి వెళ్లి ఆయనను ప్రత్యేకంగా కలిశారని ఓ వెబ్‌సైట్‌లో వార్తలు వచ్చాయి.

ఈ వార్త కాస్తా నెట్టింట వైరల్‌గా మారడం వల్ల అది హరీశ్‌శంకర్ కంటపడింది. దీంతో ఆయన ట్విట్టర్ వేదికగా ఆ వెబ్‌సైట్‌ని ట్యాగ్ చేస్తూ.. "ఇందులో ఏ మాత్రం నిజం లేదండి. మీరు ఇలాంటి వార్తలు ఏదైనా పోస్ట్ చేసేముందు నన్ను ఒక్కసారి సంప్రదించండి. ఏ సమయంలోనైనా నేను అందుబాటులోనే ఉంటాను" అని సున్నితంగా రిప్లై ఇచ్చారు.

ఇక, గురువారం సాయంత్రం జరిగిన 'అంటే.. సుందరానికీ..' ప్రీ రిలీజ్ వేడుకలోనూ 'భవదీయుడు భగత్‌సింగ్' గురించి పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ స్పందించారు. సినిమా షూట్ త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించి చాలాకాలమైనా షూట్ ప్రారంభించకపోవడం వల్ల అందరూ రకరకాలుగా అనుకుంటున్నారని.. వాటిల్లో నిజం లేదని చెప్పారు. "సినిమా ఎప్పుడు వచ్చినా సరే మీరు మళ్లీమళ్లీ చూసేలా ఉంటుంది. డైలాగులు, పాటలు పదికాలాలపాటు గుర్తుండేలా ఉంటాయి" అని హరీశ్ క్లారిటీ ఇచ్చారు.
ఇదీ చూడండి: SSMB 28: మహేశ్‌కు జోడీగా మరోసారి రష్మిక?