Salaar Vs Dunki Clash : అనుకున్నట్టే జరిగింది. 'సలార్' మూవీ ఈ ఏడాది డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు(Salaar New Release Date 2023) . దీంతో మళ్లీ కొంతమంది మేకర్స్‌కు కొత్త టెన్షన్ మొదలైనట్టే. ఎందుకంటే ఇంత పెద్ద భారీ చిత్రం వస్తుందంటే.. దీనికి పోటీగా ఏ సినిమాలు రావడానికి సాహసం చేయవు. అయితే ఇప్పటికే పలు చిత్రాలు క్రిస్మస్ సీజన్‌ను ఖరారు చేసుకున్నాయి. వీటిలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ 'డంకీ' ఒకటి.
అందుకే 'సలార్' కొత్త విడుదల తేదీ ప్రకటించగానే అందరీ దృష్టి.. 'సలార్ వర్సెస్ డంకీ'పైనే పడింది. ఎందుకంటే 'డంకీ' సినిమా విడుదల తేదిని ఎప్పుడో అనౌన్స్ చేశారు మేకర్స్. పైగా 'పఠాన్', 'జవాన్'తో బ్యాక్ టు బ్యాక్ రూ.1000కోట్ల గ్రాండ్ సక్సెస్ అందుకున్న షారుక్.. 'డంకీ'తో హ్యాట్రిక్ హిట్ కొడతారని అంతా గట్టిగా నమ్ముతున్నారు. అయితే భారీ ఓపెనింగ్స్ సాధించే హీరోల సినిమాలు ఒకే రోజు రావడం మంచిది కాదన్న సంగతి తెలిసిందే. అవి వసూళ్లపై ప్రభావం చూపుతాయి. కాబట్టి షారుక్.. 'డంకీ'ని ముందుగా అనుకున్న తేదీకే విడుదల చేసి ప్రభాస్‌తో పోటీ పడతారా లేదంటే వాయిదా వేసుకుంటారో చూడాలి..
Christmas Release Movies 2023 Tollywood : ఇకపోతే ఈ 'సలార్' కొత్త రిలీజ్ డేట్ వార్త.. ఇతర టాలీవుడ్ సినిమాలకు పెద్ద షాకే. ఎందుకంటే.. ఇప్పటికే క్రిస్మస్ సీజన్‌పై నాలుగు తెలుగు చిత్రాల వరకు కర్చీఫ్‌లు వేశాయి. ఇప్పుడు 'సలార్' వస్తుంది కాబట్టి... ఆ చిత్రాలన్నీ ముందుకో, వెనక్కో వెళ్లాల్సిందే. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'హాయ్ నాన్న'ను డిసెంబర్ 21న, వెంకటేశ్ 'సైంధవ్', సుధీర్ బాబు 'హరోం హర' చిత్రాలు డిసెంబర్ 22న, నితిన్ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' డిసెంబర్ 23న రిలీజ్ కానున్నట్లు గతంలో అనౌన్స్మెంట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేయాలనేదే ప్లాన్. మరి ఇప్పుడు ప్రభాస్ సినిమా వచ్చేందుకు రెడీ అయింది కాబట్టి.. ఇతర భాషల ప్రేక్షకులు మరో తెలుగు హీరో చిత్రాన్ని పట్టించుకోవడం కష్టమే. కాబట్టి.. ఈ చిత్రాలన్నీ విడుదల తేదిని మార్చుకోవాల్సిందే.
-
𝐂𝐨𝐦𝐢𝐧𝐠 𝐁𝐥𝐨𝐨𝐝𝐲 𝐒𝐨𝐨𝐧!#SalaarCeaseFire Worldwide Release On Dec 22, 2023.#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @vchalapathi_art @anbariv… pic.twitter.com/IU2A7Pvbzw
— Hombale Films (@hombalefilms) September 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝐂𝐨𝐦𝐢𝐧𝐠 𝐁𝐥𝐨𝐨𝐝𝐲 𝐒𝐨𝐨𝐧!#SalaarCeaseFire Worldwide Release On Dec 22, 2023.#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @vchalapathi_art @anbariv… pic.twitter.com/IU2A7Pvbzw
— Hombale Films (@hombalefilms) September 29, 2023𝐂𝐨𝐦𝐢𝐧𝐠 𝐁𝐥𝐨𝐨𝐝𝐲 𝐒𝐨𝐨𝐧!#SalaarCeaseFire Worldwide Release On Dec 22, 2023.#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @vchalapathi_art @anbariv… pic.twitter.com/IU2A7Pvbzw
— Hombale Films (@hombalefilms) September 29, 2023
Salaar Overseas Rights : సలార్ రికార్డ్ బిజినెస్.. RRR తర్వాత ఇదే లార్జెస్ట్ డీల్!