ETV Bharat / entertainment

సలార్ వీర కుమ్ముడు- 3రోజుల్లో రూ.400కోట్లు- ప్రభాస్​​ దెబ్బా మజాకా! - సలార్ వార్తలు

Salaar Third Day Collection Worldwide : సలార్ సినిమా వసూళ్ల ప్రభంజనం మూడో రోజు కూడా కొనసాగింది. బాక్సాఫీస్ వద్ద ఈ యాక్షన్ చిత్రం దుమ్మురేపుతోంది.

Salaar box office day 3
Salaar box office day 3
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 10:42 AM IST

Updated : Dec 25, 2023, 2:53 PM IST

Salaar Third Day Collection Worldwide : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ సలార్- పార్ట్ 1 సీజ్‍ ఫైర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్​ కలెక్షన్లతో సత్తాచాటుతోంది. 2023లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన భారతీయ మూవీగా నిలిచింది. ఇప్పుడు సెకెండ్ డే కన్నా మూడో రోజు భారీ వసూళ్లను సాధించింది.

3రోజుల్లో రూ.400కోట్లు!
మూడు రోజులు కలిపి వరల్డ్​వైడ్​గా ఈ సినిమా రూ.402 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక ఇంకో రోజులో ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్​లోకి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం క్రిస్మస్ హాలీడే, మంగళవారం హాఫ్​ డే కనుక ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టే అవకాశముందని చెప్పాయి. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.176 కోట్లు, రెండో రోజు రూ.119 కోట్లు, మూడో రోజు రూ.107 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

నైజాంలో రూ.50కోట్లు!
నైజాంలో ఈ సినిమా మూడు రోజులు కలిపి రూ.44.80 కోట్లకుపైగా షేర్ సాధించినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆంధ్రలో కూడా భారీగానే వసూళ్లు రాబడుతున్నట్లు తెలుస్తోంది. సలార్ చిత్రంలో ప్రభాస్‍ ఎలివేషన్లుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రభాస్ కటౌట్‍కు ఇది సరైన సినిమా అని ప్రశంసిస్తున్నారు.

ఇక సినిమా విషయానికొస్తేృ- ప్రభాస్‍తో పాటు మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముఖ్యమైన పాత్ర చేశారు. ప్రాణ స్నేహితులుగా ఉండే వీరు బద్ద శత్రువులుగా ఎలా మారారు అనే విషయంపై ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

మరోవైపు, ఈ సినిమా రిలీజ్​కు ఒక్క రోజు ముందు విడుదలైన షారుక్ ఖాన్ డంకీ మిక్స్​డ్ టాక్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజులు కలిపి రూ.200 కోట్లకుపైగా వసూలు చేసింది.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'సలార్'​ కాదు- 'ఆదిపురుష్'​ను కూడా 'డంకీ' టచ్​ చేయలేకపోయిందట!

'సలార్​'లో దేవ - వరదా సందడి -బిహైండ్​ ద సీన్స్​లో పిక్చర్​ పర్ఫెక్ట్ ఫొటోలు

Last Updated : Dec 25, 2023, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.