Salaar Postpone News : ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్‌పై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా తెలుగు చిలన సీమలో ఇది మరింత ఎక్కువ కనపడుతోంది. దర్శకనిర్మాతలంతా తమ సినిమాల రిలీడ్ డేట్స్ విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. వీటన్నింటికీ కారణం ఒకే ఒక్క చిత్రం. అదే పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'సలార్'. 'సింపుల్ ఇంగ్లీష్..' అంటూ ప్రభాస్‌ను డైనోసార్‌తో పోల్చి.. భారీ అంచనాలతో ఊరించి ఊరించి... చివరికి పోస్ట్ పోన్ ప్రచారం అంటూ ఒక్కసారిగా పాన్ ఇండియా ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కు గురి చేసి షేక్ చేసేసింది. దీంతో ఇతర దర్శకనిర్మాతల డైలామలోకి వెళ్లిపోయారు.
అసలీ చిత్రం సెప్టెంబర్ 28న రావాల్సి ఉంది. దీంతో ఇతర సినిమాలన్నీ ఆ సమయానికి ముందు వెనక దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ అన్నీ సీజన్లను లాక్ చేసుకున్నాయి. కానీ ఇప్పుడు సలార్ వాయిదా ప్రచార వార్తతో వీటి అంచనాలన్నీ ఒక్కసారిగా తారుమారైపోయాయి. దీపావళికి సల్మాన్ 'టైగర్3', తమిళంలో 'అయలాన్', 'జపాన్', 'జిగర్తాండ 2'తో పాటు ఇంకా పలు చిత్రాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. సలార్ కొత్త రిలీజ్ డేట్ బాంబ్.. ఎక్కడ వచ్చి తమ సినిమాల రిలీజ్‌పై పడుతుందా అని ఇతర దర్శకనిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.
అయితే ఇదే సమయంలో మరి కొంతమంది దర్శకనిర్మాతలు అలర్ట్ అయిపోయారు. ముందుగా అనుకున్న 'సలార్' రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28 సమయానికి రిలీజ్ చేయాలని కాచుకుని కూర్చున్నారు. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్'(Rules ranjan release date) చిత్రాన్ని సెప్టెంబర్ 28న రానున్నట్లు అధికార ప్రకటన కూడా చేసేశారు. దీంతో సలార్ పోస్ట్‌పోన్ పక్కా అని దాదాపుగా కన్ఫామ్ అయిపోయింది. ఇక ఇతర చిత్రాలు కూడా సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యే దిశగా సాగేందుకు ప్రయత్నిస్తున్నాయి.
-
Sep 28th ❤️#RulesRanjann #RulesRanjannonsep28th pic.twitter.com/4MBErNCqqs
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sep 28th ❤️#RulesRanjann #RulesRanjannonsep28th pic.twitter.com/4MBErNCqqs
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) September 4, 2023Sep 28th ❤️#RulesRanjann #RulesRanjannonsep28th pic.twitter.com/4MBErNCqqs
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) September 4, 2023
రవితేజ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswarao Release Date), రామ్ పోతినేని స్కంద(Skanda Release Date) కూడా సెప్టెంబర్ 28కే అంటూ ప్రచారం సాగుతోంది. టైగర్ నాగేశ్వరరావు అయితే ఇదే విడుదల తేదీని కన్ఫామ్ చేసుకున్నట్లు తెలిసింది. అసలీ సినిమా బాలకృష్ణ భగవంత్ కేసరి, దళపతి విజయ్ లియోతో పాటు అక్టోబర్ 20న రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఆ సమయంలో పోటీ కాస్త గట్టిగా ఉండటం వల్ల రిలీజ్ డేట్‌ను ముందుకు జరపాలని అనుకుంటున్నారు. తాజాగా విడుదలైన ఏక్ దమ్ సాంగ్ ప్రోమో పోస్టర్‌పై కూడా అక్టోబర్ 20 రిలీజ్ డేట్ స్టాంప్‌ను తొలిగించారు. దీంతో ఈ చిత్రం సెప్టెంబర్ 28న లేదా 29న రావడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.
ఇంకా బోయపాటి-రామ్ సినిమా సెప్టెంబర్ 15న విడుదలకు అవ్వాలి. కానీ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇంకా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందిన మ్యాడ్ చిత్రం సెప్టెంబర్ 28న రాబోతున్నట్లు అనౌన్స్ మెంట్ వచ్చింది. అలా మొత్తంగా ఒక్క సలార్ రిలీజ్ వాయిదా వార్త.. ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్‌పై గందరగోళ పరిస్థితిని నెలకొల్పింది. ఈ విడుదల తేదీల గోలపై ఓ స్పష్టత రావాలంటే.. ఈ వారం ఆగాల్సిందే..
Rules Ranjan Movie : సెప్టెంబర్ 28నే కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్'.. 'సలార్' లేనట్టేనా?
Salaar Postponed : యూఎస్‌లో టెన్షన్ టెన్షన్.. టికెట్ డబ్బులు రీఫండ్!