ETV Bharat / entertainment

ఫ్యాన్స్​కు తేజూ రిక్వెస్ట్​.. ట్విట్టర్​ వేదికగా ఎమోషనల్​.. - సాయిధరమ్​ తేజ్​ చిన్నప్పటి ఫొటో

Sai Dharam tej Bro Movie : టాలీవుడ్​ సుప్రీమ్​ స్టార్​ సాయిధరమ్​ తేజ్​ తాజాగా తన మామయ్యతో కలిసి 'బ్రో' సినిమాలో నటించారు. శుక్రవారం ఆ మూవీ రిలీజైన సందర్భంగా ట్విట్టర్​ వేదికగా ఫ్యాన్స్​ కోసం ఆయన ఓ ఏమెషనల్​ పోస్ట్ షేర్​ చేశారు. అదేంటంటే..

sai dharam tej
sai dharam tej
author img

By

Published : Jul 28, 2023, 1:27 PM IST

Sai Dharam Tej Emotional Post : పవన్​ కల్యాణ్​, సాయిధరమ్​ తేజ్​ ప్రధాన పాత్రలు పోషించిన 'బ్రో' మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. వినోదాయ సిత్తం అనే తమిళ సినిమాకు రీమేక్​గా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్​ రెస్పాన్స్​ అందుకుంటోంది. ఈ సందర్భంగా సుప్రీం హీరో సాయి ధరమ్‌తేజ్‌ సోషల్ మీడియా వేదికగా ఓ ఏమోషనల్​ పోస్ట్ చేశారు. పవన్‌ కల్యాణ్‌తో తాను చిన్నప్పుడు తీసుకున్న ఓ ఫొటోను షేర్​ చేసిన ఆయన.. 'అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి!' అనే క్యాప్షన్​ను ఆ ఫొటోకు జత చేశారు. తన మామయ్య పవన్‌ కల్యాణ్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఆ పోస్ట్​లో పేర్కొన్నారు.

"ప్రస్తుతం నాలో ఉన్న ప్రతి ఎమెషన్​కు అక్షర రూపం ఇవ్వాలని ఉంది. నా గురువు, నా మామయ్య, నా స్ఫూర్తి.. పవన్‌కల్యాణ్‌తో కలిసి స్క్రీన్ పంచుకునే అదృష్టం నాకు దక్కింది. నేను ఇప్పటికీ ఆయన చేయి పట్టుకున్న చిన్నపిల్లాడినే. నాపై ఎనలేని నమ్మకం ఉంచి ఇంత గొప్ప సినిమాకు నన్ను ఎంపిక చేసిన తివిక్రమ్‌కు నా ధన్యవాదాలు. మీ వల్లే నా ఈ కల నిజమైంది. అలాగే సముద్ర ఖని, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, 'బ్రో' మూవీ టీమ్​లో అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నా ముగ్గురు మామయ్యలకు వారి అభిమానులకు, సినీ ప్రియులకు అందరికీ థ్యాంక్స్​. మీరు చూపించే ఈ ప్రేమాభిమానాలను నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ సినిమా మనందరిదీ. దీని చూసి మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అంటూ తనని ఆదరిస్తున్న ప్రేక్షకులకు తేజ్​ సోషల్ మీడియా ద్వారా స్పెషల్​ థ్యాంక్స్​ చెప్పారు.

ఫ్యాన్స్​కు విన్నపం..
Sai Dharam Tej Tweet : ఇక ఇదే వేదికగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి మరో పోస్ట్​ షేర్​ చేశారు సాయి ధరమ్​ తేజ్​. ప్రస్తుతం ఏకధాటిగా వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులకు సూచించారు.

ప్రియమైన అభిమానులకు.. మీరు నాపై చూపిస్తోన్న అమితమైన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. 'బ్రో' సినిమాను ఒక స్పెషల్‌ ప్రాజెక్ట్‌గా భావించి మీరెంతగానో సెలబ్రేట్‌ చేస్తున్నారు. దీన్ని మరింత ఎక్కువ మందికి చేరువేసేందుకు భారీ కటౌట్స్‌, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా మీ ప్రేమను పొందుతున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. అయితే బ్యానర్స్‌, కటౌట్స్‌ ఏర్పాటు చేసే సమయంలో దయచేసి జాగ్రత్తగా ఉండండి. బాధ్యతగా వ్యవహరించండి. మీరు సురక్షితంగా ఉండటమే నాకు కావాల్సింది. ఈ సంతోషకరమైన వేడుకల్లో మీకు ఏమైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేను" అని తేజూ ట్విట్టర్​ వేదికగా ఫ్యాన్స్​కు విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.