RRR OTT Release date: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1100 కోట్ల వసూళ్లు సాధించింది. ఒకే పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి తెరపంచుకోవడంతో ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూడాలనుకునేవారి సంఖ్య పెరిగింది. దీంతో ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5.. 'ఆర్‌ఆర్‌ఆర్' డిజిటల్ ప్రిమియర్ డేట్‌ని ప్రకటించింది. మే 20 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో 'ఆర్‌ఆర్‌ఆర్' తమ ఫ్లాట్‌ఫామ్ వేదికగా అందుబాటులోకి రానుందని తెలిపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. ఈ ప్రకటనతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' వచ్చేస్తోంది అంటూ తమ సంతోషాన్ని నెట్టింట్లో పంచుకుంటున్నారు. మరోవైపు అదేరోజున తారక్ పుట్టినరోజు కూడా ఉండటంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఓటీటీ రిలీజ్.. తమకి మరింత స్పెషల్ అని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.
ఇదీ చూడండి: రివ్యూ: మహేశ్ 'సర్కారువారి పాట' ఆకట్టుకుందా?