ETV Bharat / entertainment

ప్రధాని మోదీతో రామ్​చరణ్​ ప్రత్యేక భేటీ.. చిరు సత్కారం కూడా ఉందట! - india today conclave 2023 ram charan

మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. దిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో చరణ్​.. ప్రధాని మోదీతో వేదికను పంచుకోనున్నారు. అనంతరం మోదీతో ప్రత్యేకంగా చరణ్​ సమవేశం కానున్నారు.

ram charan modi
ram charan modi
author img

By

Published : Mar 17, 2023, 9:43 AM IST

Updated : Mar 17, 2023, 11:52 AM IST

ఆస్కార్​ అవార్డు సాధించిన ఆనందాన్ని ఆస్వాదిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్'​ టీమ్​కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. హీరో మెగా పవర్​ స్టార్ రామ్ చరణ్​.. ప్రధాని మోదీతో శుక్రవారం వేదికను పంచుకోనున్నారు. ఇండియా టుడే ఛానల్​ ​నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సులో రామ్​చరణ్​ పాల్గొననున్నారు. అనంతరం మోదీతో ప్రత్యేక భేటీ కానున్నారు. ఆస్కార్​ వేడుకల కోసం అమెరికాకు వెళ్లిన చరణ్​ ఈ కార్యక్రమం కోసం శుక్రవారం ఉదయం దిల్లీ చేరుకున్నారు. అనంతరం అక్కడున్న విలేకరులతో చరణ్​ మాట్లాడారు.

"నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. కీరవాణి,రాజమౌళి, చంద్రబోస్​లను చూసి మేము గర్విస్తున్నాము. వారి కృషి వల్లనే మేము రెడ్ కార్పెట్‌పై వెళ్లి భారత్‌కు ఆస్కార్‌ తీసుకురాగలిగాము. ఆర్​ఆర్​ఆర్​ సినిమాను చూసి "నాటు నాటు" పాటను సూపర్‌హిట్ చేసినందుకు భారతీయ అభిమానులందరికీ నా ధన్యవాదాలు. 'నాటు నాటు' అనేది మా పాట కాదు అది భారతదేశంలోని ప్రజల పాట. అది మాకు ఆస్కార్ అవార్డును అందుకునేందుకు ఒక మార్గాన్ని ఇచ్చింది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

mega powerstar ram charan
విమానాశ్రయం వద్ద విలేకర్లతో మాట్లాడుతున్న రామ్​ చరణ్​

అయితే చరణ్​ను ప్రధాని మోదీ సత్కరించనున్నారని సమాచారం. ఇదే వేదికపై రామ్​చరణ్ ప్రసంగం కూడా ఉంటుందని తెలిసింది. ఆ కార్యక్రమంలో మోదీ, చరణ్​, సచిన్​తో పాటు హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, కిరణ్ రిజిజు, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేతలు శశి థరూర్, పి చిదంబరం, తృణముల్​ కాంగ్రెస్​ ఎంపీ మహువా మోయిత్రా, పారిశ్రామికవేత్తలు అనిల్ అగర్వాల్, సంజీవ్ గోయెంకా, పారిశ్రామికవేత్త, బైజూ రవీంద్ర వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. జన్యు శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్​తో పాటు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్​ ఎస్​ ఏ బోబ్డే, జస్టిస్​ యూయూ లలిత్ తదితరులు పాల్గొననున్నారు. ఆస్కార్ గెలిచిన తర్వాత రామ్​ చరణ్ దిల్లీలో తొలిసారి పర్యటిస్తున్నందున అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఫ్యాన్స్​ భారీ ఎత్తున నినాదాలు చేశారు.

'ఆర్​ఆర్​ఆర్'కు ఆస్కార్ ​దక్కడంతో తెలుగు సినిమాకు ఉన్న రేంజ్​ మరింత పెరిగిపోయింది. సినిమా కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆస్కార్​ రూపంలో గుర్తింపు లభించింది. ఈ ఒక్క సక్సెస్​తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్​ స్టార్​గా మారిపోయారు. సినీ ప్రమోషన్లలో భాగంగా అమెరికాకు వెళ్లిన రామ్​ చరణ్​ అక్కడి పలు ప్రతిష్ఠాత్మక ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. హాలీవుడ్​లో కూడా రామ్​ చరణ్​కు మంచి సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని అప్పట్లో ఆయనే చెప్పారు.

చరణ్​ బర్త్​డే స్పెషల్​.. టైటిల్​ రివీల్​..
ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్​ చరణ్​ ప్రస్తుతం శంకర్​ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్​సీ 15' లో నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్​ చరణ్​ సరసన కియారా అడ్వాణీ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్​ శరవేగంగా పూర్తిచేసుకుంటోంది. కర్నూల్​, హైదరాబాద్​ లాంటి లొకేషన్లలో ఇటీవలే షూటింగ్​ కూడా జరిగింది. మార్చి 27వ తేదీన రామ్​ చరణ్​ బర్త్​డే సందర్భంగా ఈ మూవీ టైటిల్​ను అనౌన్స్​ చేస్తున్నట్లు చిత్ర యూనిట్​ తెలిపింది.

హైదరాబాద్​ చేరుకున్న 'ఆర్​ఆర్​ఆర్'​ బృందం..
అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని విమానాశ్రయానికి చేరుకున్న రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి, ఆయన సతీమణి వల్లి, కార్తికేయ, కాలభైరవ, శ్రీసింహా, తదితరులుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజమౌళి, కీరవాణితో ఫొటోలు దిగేందుకు వారు ఆసక్తి కనబరిచారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణం రద్దీగా మారింది. కట్టు దిట్టమైన భద్రత నడుమ కీరవాణి, రాజమౌళి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చారు. మరోవైపు 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌తో మాట్లాడేందుకు పలువురు విలేకర్లు ప్రయత్నించగా.. 'జైహింద్‌' అంటూ రాజమౌళి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Last Updated : Mar 17, 2023, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.