ETV Bharat / entertainment

'ఎత్తర జెండా'​ జక్కన్న సర్​ప్రైజ్​​.. 'కళావతి' సాంగ్​ కొత్త రికార్డు! - చిన్ని మూవీ ట్రైలర్​

Movie Updates: సినీ అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో 'ఆర్​ఆర్​ఆర్'​ ఎత్తరజెండా, 'సర్కారు వారి పాట' కళావతి సాంగ్​ అప్డేట్స్​తో పాటు కీర్తి సురేష్​ 'చిన్ని' సినిమాకు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

ettara jenda
ettara jenda
author img

By

Published : Apr 26, 2022, 5:15 PM IST

RRR Etthara Jenda Full Video Song Released: వారానికో ఫుల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తూ సినీ అభిమానుల్ని అలరిస్తోంది 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్ర బృందం. ఇప్పటికే 'నాటు నాటు', 'కొమ్మా ఉయ్యాలా', 'దోస్తీ' వీడియోలు పంచుకున్న టీమ్‌ తాజాగా సెలబ్రేషన్‌ ఏంథమ్‌ 'ఎత్తర జెండా'ను అభిమానులకు అందించింది. సినిమా విడుదలకు ముందే ఈ పాటకు సంబంధించిన వీడియోను రిలీజ్‌ చేసినా అందులో కథానాయకులు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, కథానాయిక అలియా భట్ మాత్రమే కనిపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ కొత్త వీడియోలో దర్శకుడు రాజమౌళి, అజయ్‌దేవ్‌గణ్‌, ఒలివియా మోరిస్‌ తళుక్కున మెరిశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, ఎం. ఎం. కీరవాణి సంగీతం, విశాల్‌ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హరికా నారాయణ్‌ గానం ఎంతగా అలరించాయో తెలిసిందే. మార్చి 25న విడుదలైన ఈ పాన్‌ ఇండియా చిత్రం రూ. 1100 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, రికార్డు సృష్టించింది.

Kalvathi Song New Record: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా.. విడుదలకు ముందే పలు రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ 'కళావతి' సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అత్యంత వేగంగా 100మిలియన్‌ వీక్షణలతో అరుదైన ఘనత సాధించిన ఈ పాట తాజాగా 150 మిలియన్‌ వ్యూస్‌తో మరో రికార్డును తన ఖాతాలో వేసుకొంది. విడుదలైన నాటి నుంచి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లు ఉన్న ఈ 'కళావతి' ఈ సంవత్సరంలోని పాటలన్నింటిలో మెలోడీ సాంగ్‌గా ముద్ర వేసుకొంది. ఇంటర్నెట్‌ సంచలనంగా మారిన ఈ పాటకు ఇప్పటి వరకు 1.9మిలియన్ల లైక్స్‌ వచ్చాయి. మహేశ్‌ బాబు సింపుల్‌ మూమెంట్స్‌తో, క్లాసీలుక్స్‌తో అలరించిన ఈ పాట ఆడియో స్ట్రీమింగ్‌ వేదికలన్నింటిలో అగ్రస్థానంలో నిలిచింది. అనంత శ్రీరామ్‌ రాసిన లిరిక్స్‌కు సిద్‌ శ్రీరామ్‌ గొంతుకు సంగీతాభిమానులు ముగ్ధులయ్యారు.

ఈ సినిమా నుంచి తాజాగా విడుదల చేసిన పెన్నీ, టైటిల్‌ ట్రాక్‌లు కూడా మంచి ప్రేక్షకాదరణతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాలోని మాస్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేయాలని ఈ చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్‌ సరసన కీర్తి సురేష్‌ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్స్‌, 14 రీల్స్‌ బ్యానర్‌లపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Keerthy Suresh Chinni Movie Trailer: 'ఇప్పుడున్న కోపంలో నీ వెన్నెముక లాగి, నీ ఆసనంలో పొడిచి చంపేయాలని ఉంది. దీంతో నీతో కలిపి 25 హత్యలు అవుతాయి' అంటూ హెచ్చరిస్తోంది కీర్తి సురేశ్‌. సెల్వరాఘవన్‌తో కలిసి ఆమె నటించిన చిత్రం 'చిన్ని'అరుణ్‌ మథేశ్వరం దర్శకుడు. ఇప్పటి వరకూ గ్లామర్‌ పాత్రలతో పాటు, 'మహానటి' వంటి కథాబలమున్న క్యారెక్టర్‌లతో ప్రేక్షకులను మెప్పించిన కీర్తి సురేశ్‌ 'చిన్ని'తో ఓ విభిన్న పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు.

కొన్ని సన్నివేశాల్లో ఆమెను చూస్తుంటే, 'మహానటి'లో చేసిన కీర్తి సురేశేనా అన్నంతలా అదరగొట్టారు. పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేసిన చిన్ని అనే యువతి రంగయ్యతో కలిసి 24 హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఇంతకీ రంగయ్యకు, చిన్నికీ ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మే 6న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ప్రైమ్‌ వీడియో వేదికగా 'చిన్ని' స్ట్రీమింగ్‌ కానుంది. శ్యామ్‌ సీఎస్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉంది.

ఇవీ చదవండి:

'సిద్ధ పాత్రలో పవన్​కల్యాణ్'.. చిరు స్పందన ఇదే

'రాజీవ్​కు విడాకులు నిజమేనా?'.. సుమ షాకింగ్​ కామెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.