దంతవైద్యం వికటించి కర్ణాటకకు చెందిన ఓ యువనటి ముఖం గుర్తుపట్టరానంతగా మారిపోయింది. కన్నడ యువనటి స్వాతి.. బెంగుళూరులోని ఓ దంత వైద్యశాలలో రూట్ కెనాల్ చికిత్స చేయించుకుంది. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె ముఖం ఉబ్బిపోయింది. విపరీతమైన వాపుతో గుర్తు పట్టలేనంతగా మారింది.
బాధితురాలు రూట్ కెనాల్ చేసిన వైద్యులను సంప్రదించగా.. వాపు రెండు మూడు రోజుల్లో తగ్గుతుందని చెప్పారని, 3 వారాలైనా ఎలాంటి పురోగతి లేదని వాపోయింది. వాపుతోపాటు ముఖమంతా నొప్పిగా ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. అనస్థీషియాకు బదులుగా సాలిసిలిక్ యాసిడ్ ఇవ్వటం వల్లనే ముఖంపై వాపు ఏర్పడినట్లు మరో ఆస్పత్రిని సంప్రదించగా తెలిసినట్లు యువనటి స్వాతి పేర్కొంది. కోలుకున్న తర్వాత ఆ ఆస్పత్రిపై కేసు వేయనున్నట్లు స్వాతి హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల్లో యువనటి స్వాతి ముఖం వాచిన చిత్రాలు వైరల్‌గా మారాయి.
ఇదీ చూడండి: ఫ్యాట్ సర్జరీ వికటించి ప్రముఖ టీవీ నటి మృతి.. 21 ఏళ్లకే..