కన్నడ పరిశ్రమ మళ్లీ భారత సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవలే 'కేజీయఫ్', 'చార్లీ 777', 'విక్రాంత్ రోణ' వంటి అదిరిపోయే సినిమాలను అందించిన కన్నడ ఇండస్ట్రీ.. తాజాగా 'కాంతార' అనే మరో అదిరిపోయే చిత్రాన్ని ప్రేక్షకుల మందుకు తీసుకొచ్చింది. సెప్టెంబరు 30న చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. విడుదలై పది రోజులైనా ఇంకా హౌస్‌ఫుల్‌తో దూసుకెళ్తోంది. చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌తో రోజురోజుకి స్క్రీన్స్, షోలు పెరుగుతున్నాయి. దీంతో ఈ చిత్ర కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి.
కాగా, ఈ చిత్రాన్ని కన్నడతో పాటు మిగతా రాష్ట్రాల్లోని మెట్రో నగరాల్లోనూ ఒరిజినల్ వెర్షన్లో విడుదల చేశారు. అన్ని చోట్ల మంచి స్పందనను అందుకుంటోంది. ఇప్పటివరకు తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.60-61కోట్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలో రూ.57కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం.
అయితే ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణతో.. అన్ని భాషల సినీ ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై పడింది. ఈ మూవీని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్.. తాజాగా హిందీ, మలయాళం, తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తెలుగులో మాత్రం అక్టోబర్ 15న సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రచారం చిత్రం ఆద్యంతం పవర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. గ్రామ నేపథ్యంలో సాగే కథ, సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్ని ఆకట్టుకుంటున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కాగా, 'కాంతారా' అంటే సంస్కృత భాషలో అడవి. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని తిరిగి ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఇందులో చూపించారు. ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.
ఇదీ చూడండి: ఆ ఒక్క ప్రకటన.. సల్మాన్ కెరీర్‌కే బిగ్ టర్నింగ్ పాయింట్