ETV Bharat / entertainment

టాలీవుడ్​లో మరో క్రేజీ కాంబో.. 'జాతిరత్నాలు' డైరెక్టర్​కు రవితేజ గ్రీన్​ సిగ్నల్​! - రవితేజ సినిమాలు 2023

తెలుగులో మరో క్రేజీ కాంబినేషన్​ ప్రేక్షకులను అలరించబోతోంది. టాలీవుడ్​ మాస్​ మహారాజ రవితేజ, జాతిరత్నాలు ఫేమ్​ అనుదీప్​ కేవీ కాంబినేషన్​ ఓ కామెడీ ఎంటర్​టైనర్​ తెరకెక్కనుందట. ఆ వివరాలు..

ravi teja anudeep kv
ravi teja anudeep kv
author img

By

Published : May 14, 2023, 5:01 PM IST

Updated : May 14, 2023, 6:15 PM IST

ఇటు హీరోగా అటు నిర్మాతగా దూసుకెళ్తున్నారు టాలీవుడ్​ మాస్​ మహారాజ రవితేజ. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన సినిమాలు విడుదలయ్యాయి. మెగాస్టార్​ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలో.. చిరు తమ్ముడి పాత్రలో అధ్భుతంగా నటించారు ఈ మాస్​ హీరో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత సస్పెన్స్​ క్రైమ్ థ్రిల్లర్​ 'రావణాసుర'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్​ ముందు అంతగా రాణించలేకపోయింది. ప్రస్తుతం రవితేజ.. దర్శకుడు మహేశ్​తో 'టైగర్ నాగేశ్వరరావు' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్​లో విడుదల చేసేందుకు మూవీ టీమ్​ సన్నాహాలు చేస్తోంది. అయితే, తాజాగా ఈ మాస్​ మహారాజ్​ మరో సినిమాకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో టాక్​ నడుస్తోంది.

'జాతిరత్నాలు' సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన యువ దర్శకుడు అనుదీప్​ కేవీ, రవితేజ కాంబినేషన్​లో ఓ సినిమా రాబోతోందట. అనుదీప్​ దర్శకత్వంలో రవితేజ టైమింగ్​తో ఓ కామెడీ ఎంటర్​టైనర్​ రూపొందుతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొదటి సినిమాతోనే సాలిడ్​ హిట్​ ఇచ్చిన అనుదీప్​.. కామెడీ అద్భుతంగా పండించగల రవితేజను ఎలా చూపించబోతున్నారన్న ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది. ఈ కామెడీ కాంబో వర్కవుట్​ అయితే బొమ్మ బ్లాక్​బస్టర్​ హిట్ట్​ కొట్టడం ఖాయమని అంటున్నారు అభిమానులు. అయితే, ఈ వార్తలపై అటు రవితేజ గాని.. అనుదీప్​ గాని స్పందించలేదు.

నిర్మాతగా మాస్​ మహారాజ..
హీరోగానే కాకుండా నిర్మాతగానూ రవితేజ దూసుకెళ్తున్నారు. ఈ ప్రోడ్యూస్ చేసిన కొత్త సినిమా 'చాంగురే బాంగారు రాజా' ఈ ఏడాది జూలై 11న విడుదల కానుంది. అంతకుముందు, ఐశ్వర్య లక్ష్మి, విష్ణు విశాల్​ నాయకానాయికలుగా తెరకెక్కిన గట్ట కుస్తీ (మట్టి కుస్తీ)ని విష్ణు విశాల్​తో కలసి సంయుక్తంగా నిర్మించారు.

బాలీవుడ్​లో మాస్​ మహారాజ ఎంట్రీ!
రవితేజ బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్​ నడుస్తోంది. ఆయన వరుణ్‌ ధావన్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఇది తమిళంలో విజయవంతమైన 'మానాడు'కు హిందీ రీమేక్‌గా ఉంటుందని తెలుస్తోంది. హీరో రానా, కరణ్‌ జోహార్‌, ఏషియన్‌ సునీల్‌ దీన్ని సంయుక్తంగా నిర్మించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడిగా వ్యవహరించనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Last Updated : May 14, 2023, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.