ETV Bharat / entertainment

సుధీర్​తో ప్రేమ, పెళ్లి.. రష్మి ఏం చెప్పిందంటే? - రష్మి బొమ్మ బ్లాక్ బస్టర్​ సినిమా

సుధీర్​తో తనకున్న బంధం గురించి మాట్లాడింది నటి రష్మి గౌతమ్​. తామిద్దరి మధ్య ఉన్నది స్నేహమా, ప్రేమా?, అసలు పెళ్లి ఆలోచన ఉందా లేదా? అనేది చెప్పింది.

Rashmi comments on marrying with sudigali sudheer
సుధీర్​తో ప్రేమ, పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన రష్మి
author img

By

Published : Nov 8, 2022, 11:56 AM IST

బుల్లితెర హిట్‌ పెయిర్‌ సుధీర్‌, రష్మి క్రేజ్ గురించి తెలిసిందే. వాళ్లు ఆన్​స్క్రీన్​ లేదా ఆఫ్​స్క్రీన్​ ఎక్కడ కనిపించినా అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఎంతో కాలంగా వాళ్లు ప్రేమలో కూడా ఉన్నట్లు అంతా మాట్లాడుకుంటుంటారు. వీరిద్దరూ ఏ ఈవెంట్​లో పాల్గొన్న ఎదురయ్యే ప్రశ్న 'మీరు ప్రేమలో ఉన్నారా?', 'మీ పెళ్లి ఎప్పుడు'. కానీ ఈ విషయంపై ఆ జంట మాత్రం అధికారికంగా ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే తాజాగా మరోసారి రష్మీకి ఈ ప్రశ్న ఎదురైంది. తాను నటించిన 'బొమ్మ బ్లాక్​బస్టర్'​ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఓ విలేకరి 'సుధీర్‌, రష్మికి మధ్య ఉంది స్నేహమా, ప్రేమా?, పెళ్లి ఆలోచన ఉందా?' అని అడగ్గా ఆమె స్పందించింది.

"నా గురించి అందరికీ వివరిస్తుంటే అసలు అది నా జీవితమే అవదు. అన్ని విషయాల్ని చెప్పాల్సిన అవసరం లేదు. అది నా వ్యక్తిగతం. మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను. కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటా. భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు. ఏం జరిగినా.. అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మేం ఆఫ్‌స్క్రీన్‌లో ఎలా ఉంటామో, అదే ఆన్‌స్క్రీన్‌పై కనిపిస్తుంది. మాది పదేళ్ల ప్రయాణం. మేం అనుకొని అదంతా చేయలేదు.. ఓ మ్యాజిక్‌లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది" " అని చెప్పింది.

ఇదీ చూడండి: విశ్వక్​ స్థానంలో ఆ హీరో కోసం ఎదురుచూస్తున్న యాక్షన్ కింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.