ETV Bharat / entertainment

రణ్​బీర్​కు విషెష్​ చెప్పిన ఎక్స్​​ లవర్స్​.. నెటిజన్ల హర్షం! - కత్రినా కైఫ్​

Ranbir Alia wedding: వివాహ బంధంతో ఒక్కటైన ఆలియా -రణ్​బీర్​ జంటకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. తాజాగా దీపికా పదుకొణె, కత్రినా కైఫ్​లు విషెష్​ చెప్పటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం వారి పోస్టులు వైరల్​గా మారాయి.

Ranbir Alia wedding
రణ్​బీర్​కు విషెష్​ చెప్పిన ఎక్స్​ లవర్స్
author img

By

Published : Apr 15, 2022, 10:29 AM IST

Ranbir Alia wedding: మోస్ట్​ క్రషింగ్​ పెయిర్​ ఆలియా భట్​- రణ్​బీర్​ కపూర్​లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబయి, బాంద్రాలోని తమ నివాసంలో పంజాబ్​ సంప్రదాయం ప్రకారం గురువారం వారి పెళ్లి తంతు జరిగింది. అతి తక్కువ మంది అతిథులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకుంది రలియా జంట. ప్రేమికులుగా ఐదేళ్ల నుంచి తాము ఊసులాడుకున్న బాల్కనీలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టామని ఇన్​స్టా వేదికగా ఆలియా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆలియా- రణ్​బీర్​లకు పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్లు దీపిక పదుకొణె, కత్రినా కైఫ్​లు సైతం ఆలియా- రణ్​బీర్​ జంటకు విషెష్​ తెలిపారు. గతంలో రణ్​బీర్​తో డేటింగ్​ చేసిన ఈ భామలు అతడి పెళ్లికి విషెష్​ చెప్పడం.. నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం వారి పోస్టులు వైరల్​గా మారాయి. ఆలియా భట్​- రణ్​బీర్​ కపూర్​ల పెళ్లి ఫొటోను ఇన్​స్టాలో షేర్​ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది కత్రినా కైఫ్​. 'మీ ఇద్దరికీ అభినందనలు.. ప్రేమతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా.' అంటూ రాసుకొచ్చింది కత్రినా. తన పోస్ట్​కు రెడ్​హార్ట్​ ఎమోజీలను జత చేసింది. మరోవైపు.. ఆలియా పెట్టిన ఇన్​స్టా పోస్టుకు కామెంట్​ చేసింది దీపిక. 'మీ జీవితాంతం ప్రేమానురాగాలు, ఆనందం ఉండాలని కోరుకుంటున్నా' అంటూ పేర్కొంది.

Ranbir Alia wedding
కత్రినా కైఫ్​ పోస్ట్​
Ranbir Alia wedding
ఆలియా రణ్​బీర్​లకు కత్రిన, దీపికల శుభాకాంక్షలు

దీపిక, కత్రినా రణ్​బీర్​కు విషెష్​ చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు నెటిజన్లు. 'ఇక్కడ నిజమైన మెచూరిటీ కనిపిస్తోంది.' అంటూ ఓ నెటిజన్​ రాసుకొచ్చారు. 'సో స్వీట్​ ఆఫ్​ కత్రినా, దీపిక' అంటూ మరో అభిమాని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: నెట్టింట చక్కర్లు కొడుతున్న 'రలియా' పెళ్లి ఫొటోలు.. ​ఫుల్​ ఖుష్​లో ఫ్యాన్స్​​

వివాహ బంధంతో ఒక్కటైన ఆలియా భట్​ -రణ్​బీర్ కపూర్​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.