Virataparvam Sarala brother: 'విరాటపర్వం' చిత్ర పతాక సన్నివేశాలపై వస్తున్న విమర్శల్లో ఏ మాత్రం నిజంలేదని.. ఆ చిత్రానికి స్ఫూర్తిగా నిలిచిన సరళ సోదరుడు మోహన్ రావు స్పష్టం చేశారు. వాస్తవిక జీవితానికి దగ్గరగా దర్శకుడు వేణు ఉడుగుల 'విరాటపర్వం' చిత్రాన్ని తెరకెక్కించినట్లు పేర్కొన్న ఆయన... తన సోదరి ఉద్యమ నాయకుడ్ని కాకుండా ఉద్యమాన్ని ప్రేమిస్తూ అడవుల్లోకి వెళ్లిందని వివరించారు. ఉద్యమ నాయకుడు రవన్న రాసిన పుస్తకాన్ని చదివి స్ఫూర్తి చెంది అడవుల్లోకి వెళ్లిన్నట్లు తెలిపారు. ఈటీవీ భారత్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు.
సరళ మరణంపై రకరకాల ఊహాగానాలున్నా... వాటిపై సమగ్ర అధ్యయనం చేసి విరాటపర్వాన్ని అద్భుతంగా తీసినందుకు మోహన్ రావు ఆనందం వ్యక్తం చేశారు. ఇంటిల్లిపాది ఈ చిత్రాన్ని చూసి తమ సోదరిని గుర్తుచేసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ చిత్రం నుంచి తమ కుటుంబం ఏమి ఆశించడం లేదని, ఎక్కువ మంది చూడాలన్నదే తమ కోరికని వివరించారు.
ఇదీ చూడండి: కెమెరా అసిస్టెంట్‌గా జర్నీ స్టార్ట్.. ఇప్పుడు జబర్దస్త్, సినిమాలతో ఫుల్ బిజీ!