ETV Bharat / entertainment

'వారికి​ నేను ఎవరినో కూడా సరిగ్గా తెలియదు'.. నెపోటిజంపై రానా కీలక వ్యాఖ్యలు - నిజం విత్ స్మిత టాక్​ షోలో యాక్టర్ నాని

సోనీలివ్ వేదికగా ప్రసారమవుతోన్నసెలబ్రిటీ టాక్​ షో 'నిజం'కు ప్రముఖ గాయని స్మిత హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోలు రానా, నాని.. నెపోటిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే?..

nepotism in telugu film industry
నిజం టాక్ షోలో పాల్గొన్న రానా, నాని
author img

By

Published : Feb 25, 2023, 8:01 AM IST

ఇటీవల కాలంలో డిజిటల్ టాక్ షోల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఒకటి పూర్తయిన వెంటనే మరోక టాక్ షో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తుంది. అయితే బాలకృష్ణ తన హోస్టింగ్​తో అదరగొట్టిన అన్ స్టాపబుల్ రెండో సీజన్ ముగిసిన మరుసటి రోజే సరికొత్త టాక్ షో ప్రారంభమైంది. 'నిజం విత్ స్మిత' అనే ఈ టాక్​ షో ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ టాక్​ షోకు ప్రముఖ గాయని స్మిత హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజా ఎపిసోడ్​కు ముఖ్య అతిథులుగా వచ్చిన నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి నెపోటిజంపై తమ అభిప్రాయాలను చెప్పారు.

గత కొంతకాలంగా బాలీవుడ్​తో పాటు టాలీవుడ్​లో కూడా నెపోటిజం(బంధుప్రీతి) ఉందనే టాక్ వినిపిస్తుంది. టాలెంట్ ఉన్నప్పటికీ బ్యాక్​ గ్రౌండ్ లేని కొత్తవాళ్లకు అవకాశాలు రావటం లేదని చాలా సందర్భాల్లో పలువురు సినీ విశ్లేషకులు, నెటిజన్లు విమర్శలు చేశారు. అయితే ఇదే విషయంపై నటులు రానా, నాని తమ అభిప్రాయాన్ని తెలిపారు. సినీ ఇండస్ట్రీలో నెపోటిజం కొంత వరకు మాత్రమే ఉపయోగపడుతుందని, టాలెంట్ లేకపోతే.. ఇక్కడ నెట్టుకురావటం కుదరని పని అని రానా అన్నారు. దీంతో పాటు తెలుగులో నటుడిగా పరియమైనప్పుడు.. తాను ఈ పరిశ్రమకు చెందిన వ్యక్తినే, అయితే తాను బాలీవుడ్​లో తొలిసారి యాక్ట్​ చేసినప్పుడు అక్కడి వారికి నేనెవరినో సరిగ్గా తెలియదు అని చెప్పారు.

తన ఊరు కూడా వాళ్లకు తెలియదని.. దక్షిణాది నుంచి వచ్చాను కాబట్టి నాది చెన్నై అని చాలా మంది అనుకునేవారని రానా తెలిపారు. నెపోటిజం అనేది నా దృష్టిలో మనల్ని పరిచయం చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఒక్కసారిగా మనం స్టార్స్ కాలేమని ఆయన చెప్పారు. ఇక, ఏదో ఒకరోజు ప్రాంతీయంగా ఉన్న సినిమా పరిశ్రమలన్నీ కలిసి ఇండియన్ సినీ ఇండస్ట్రీగా మారుతుందని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో తాను అనుకున్నానని రానా తెలిపారు. అయితే తొమ్మిదేళ్లపాటు తన మాట ఎవరూ నమ్మలేదు కానీ ఇప్పుడు చూస్తే మనమంతా ఒక్కటైపోయామని ఆయన అన్నారు.

"ఒక వ్యక్తి తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లకపోతే తప్పు. ఉదాహరణకు మా కుటుంబం గురించి చెప్తే.. మా తాతయ్య ఒక రైతు. ఊర్లో ఉన్న రైస్ మిల్లు అమ్మేసి వచ్చిన డబ్బుతో చెన్నైకు వెళ్లి ఇటుకల వ్యాపారం మొదలు పెట్టారు. అనంతరం నెమ్మదిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన సుమారు 45 ఏళ్లపాటు సినిమాలు చేశారు. ఆయన ఇద్దరి కుమారులు సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. మా తాతయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక స్టూడియో కూడా ఏర్పాటు చేశారు. అయితే నేను ఒకవేళ ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లకుంటే అది నా తప్పు అవుతుంది. నేను నా కుటుంబానికి అన్యాయం చేసిన వాడని అవుతాను. ఎందుకంటే లెగసీని కొంతమంది మాత్రమే చూస్తారు. వారసత్వం వల్ల వచ్చే బరువు బాధ్యతలు అందరికీ తెలియవు. ఉన్నట్టుండి ముంబయిలో రెండు పెద్ద స్టూడియోస్ విజయ వాహిని, ఏవీఎం స్టూడియో కనుమరుగయ్యాయి. దాని వారసత్వాన్ని ఆ కుటుంబం వాళ్లు ముందుకు కొనసాగించలేకపోవటమే అందుకు ప్రధాన కారణం"
-దగ్గుబాటి రానా, యాక్టర్

నా దృష్టిలో నెపోటిజాన్ని ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు ఫాలో కావడం లేదని.. సినిమా చూసే ప్రేక్షకులే దాన్ని ప్రోత్సహిస్తున్నారని నాని అన్నారు. తన మొదటి సినిమాను లక్షమంది చూస్తే.. చరణ్ మొదటి సినిమాను కోటి మంది చూశారని ఆయన తెలిపారు. చూసిన వాళ్లే కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోంది, మీకు ఏం కావాలో వాళ్లు అది ఇస్తున్నారంతే అని నెపోటిజంపై నాని తన అభిప్రాయాన్ని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.