ETV Bharat / entertainment

ఆపరేషన్​ స్టార్ట్​ అంటున్న రామ్​ 'ది వారియర్​'​.. ఊర మాస్​లుక్​లో 'దసరా' నాని..​ - the warrior movie trailer

హీరో రామ్​ పోతినేని నటిస్తున్న 'ది వారియర్'​ మూవీ ట్రైలర్​ను చిత్రబృందం రిలీజ్​ చేసింది. మరోవైపు, నాని హీరోగా తెరకెక్కుతున్న 'దసరా' సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. అందుకు సంబంధించిన పోస్టర్​ను నాని షేర్​ చేశారు. బాలీవుడ్​ క్రైమ్​ థ్రిల్లర్​ 'ఏక్​ విలన్​ రిటర్న్స్​' సినిమా ట్రైలర్​ విడుదలై అభిమానులను ఎంతో ఆకట్టుకుంటూ మూవీపై అంచనాలు పెంచుతోంది.

movie updates
movie updates
author img

By

Published : Jul 2, 2022, 7:29 AM IST

Ram The Warrior Movie Trailer: 'ఒక చెట్టుపై 40 పావురాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క పావురాన్ని కాలిస్తే, ఇంకా ఎన్ని ఉంటాయి. అన్నీ ఎగిరిపోతాయి' అంటున్నారు రామ్‌. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రామ్‌ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రం 'ది వారియర్‌' కృతిశెట్టి కథానాయిక. శుక్రవారం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగు ట్రైలర్‌, నటుడు శివ కార్తికేయన్‌ తమిళ్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ఆద్యంతం మాస్‌ ప్రేక్షకులను అలరించేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ప్రతినాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి చెప్పిన డిఫరెంట్‌ డిక్షన్‌ భలేగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకురానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నాని 'దసరా'..
Nani Dasara Movie Look: బొగ్గు గనుల మధ్య నల్ల రంగు పులుముకుని బయటికొస్తున్న సూర్యుడిని గుర్తు చేస్తున్నాడు నాని. అచ్చమైన మాస్‌ అవతారంలో ఆయన ఎలా సందడి చేశాడో తెలియాలంటే 'దసరా' విడుదల వరకు ఆగాల్సిందే. నాని కథానాయకుడిగా... శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభమైంది. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ప్రధాన తారాగణం అంతా అందులో పాల్గొంటోంది. గోదావరి ఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే చిత్రమిది.

movie updates
హీరో నాని

నాని లుంగీ కట్టి, గెడ్డం పెంచి పక్కా అవతారంలో కనిపించనున్నారు. "పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది. నాని తెలంగాణ యాసలో మాట్లాడటంతోపాటు.. పూర్తిస్థాయి యాక్షన్‌ ప్రధానమైన పాత్రలో కనిపిస్తారు. గత షెడ్యూల్‌లో అన్బరీవ్‌ ఆధ్వర్యంలో ఓ భారీ యాక్షన్‌ ఘట్టాన్ని తెరకెక్కించాం. నాని - కీర్తిసురేష్‌తోపాటు, 500 మంది డ్యాన్సర్లపై ప్రేమ్‌ రక్షిత్‌ నృత్య దర్శకత్వంలో ఓ పాటని చిత్రీకరించాం. సుదీర్ఘంగా సాగే ప్రస్తుత షెడ్యూల్‌ కీలకం. చిత్రం తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతుంద"ని సినీ వర్గాలు తెలిపాయి. సాయికుమార్‌, జరీనా వహాబ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, కూర్పు: నవీన్‌ నూలి.

విలన్​ ఎవరు?..
బాలీవుడ్‌ నుంచి వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్లలో 'ఏక్‌ విలన్‌'కు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. 8ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా.. అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా 'ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్‌ అబ్రహం, అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. మోహిత్‌ సూరి తెరకెక్కించారు. జాన్‌కు జోడీగా దిశా పటానీ కనిపించనుండగా.. అర్జున్‌ సరసన తారా సుతారియా నటించింది. ఈ సినిమా జులై 29న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో భాగంగా ఇటీవల చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. వన్‌ సైడ్‌ లవర్‌గా ఉన్న అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతున్న సీరియల్‌ కిల్లర్‌ కథ ఇది. ఈ ప్రతినాయక ఛాయలున్న పాత్రను జాన్‌ పోషించారు. అతను చేసే వరుస హత్యలకు.. గతంలో దిశాతో తన ప్రేమకథకు ఉన్న లింకేంటి? అర్జున్‌కు అతనికి మధ్య గొడవేంటి? అసలు వీళ్లిద్దరిలో హీరో ఎవరు? విలన్‌ ఎవరు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ప్రచార చిత్రంలో కనిపించిన పోరాట ఘట్టాలు, రొమాంటిక్‌ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.

ఇవీ చదవండి: అందరి గురి 'సంక్రాంతి'పైనే.. 'మెగా154' సహా..

ఆ సమస్య వల్ల నా శరీరం సహకరించటంలేదు: శ్రుతిహాసన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.