Ram potineni Marriage: టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన హీరో రామ్పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ఈయన పెళ్లి గురించే వార్తలు ట్రెండ్ అయ్యాయి. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్మేట్ను వివాహం చేసుకోనున్నట్లు కథనాలు వచ్చాయి. కొంతకాలం నుంచి వీరు ప్రేమలో ఉన్నారని, వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారంటూ అంతా మాట్లాడుకున్నారు.
అయితే తాజాగా ఈ రూమర్స్‌పై స్పందించారు హీరో రామ్. "ఓరి దేవుడా, ఇక చాలు దయచేసి ఆపండి. నేను రహస్యంగా ఏ హై స్కూల్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవట్లేదు. దీనిపై సన్నిహితులు, కటుంబసభ్యులకు కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజం చెప్పాలంటే.. హై స్కూల్‌కు నేనెప్పుడు సరిగ్గా వెళ్లలేదు" అంటూ రామ్ పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. 'ఇస్మార్ట్ శంకర్'తో సూపర్ సక్సెస్‌ను అందుకున్న రామ్.. ఆ తర్వాత నుంచి దూకుడు కొనసాగిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఆయన నటించిన 'ది వారియర్' త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు ఆయన ఊరమాస్ డైరెక్టర్ బోయపాటితో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుందీ చిత్రం.
ఇదీ చూడండి: త్వరలోనే రామ్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?