ETV Bharat / entertainment

Ram Charan Dhruva 2 : ధృవ సీక్వెల్ తమిళ్ స్క్రిప్ట్ రెడీ.. త్వరలోనే షూటింగ్.. తెలుగులో కూడా! - రామ్ చరణ్ సురేందర్ రెడ్డి

Ram Charan Dhruva 2 : గ్లోబల్ స్టార్ రామ్​ చరణ్-సురేందర్ రెడ్డి కాంబినేషన్​లో తెరకెక్కిన హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా 'ధృవ'. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీవర్గాల్లో హాట్ టాపిక్​గా మారింది. అదేంటంటే?

Ram Charan Dhruva 2
Ram Charan Dhruva 2
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 5:47 PM IST

Updated : Aug 28, 2023, 7:04 PM IST

Ram Charan Dhruva 2 : మెగా కుటుంబం నుంచి ఏ చిన్న వార్త వచ్చినా అది ఫ్యాన్స్​కు ఓ పండగలానే ఉంటుంది. అందులోనూ గ్లోబల్ స్టార్ రామ్​చరణ్​కు సంబంధించిన న్యూస్​ అయితే ఇంకా హైప్ క్రియేట్ అవుతుంది. అయితే తమిళ సూపర్​హిట్​ సినిమా 'తని ఒరువన్' (Thani Oruvan)ను దర్శకుడు సురేంద్ర రెడ్డి.. 2016లో రీమేక్ చేశారు. ఈ సినిమాలో రామ్​చరణ్ హీరోగా నటించారు. ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. అదేంటంటే..

గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమాకు సీక్వెల్ కావాలంటూ మెగా ఫ్యాన్స్​ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా అసలు డైరెక్టర్ మోహన్ రాజా.. దీని సీక్వెల్​ కోసం కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కానీ సీక్వెల్ అప్​డేట్ వచ్చేది తమిళ సినిమాకు మాత్రమే. తెలుగు అప్​డేట్​కు సమయం పట్టొచ్చు.

'తని ఒరువన్' మూవీ మేకర్స్.. సోమవారం చెన్నైలో ఈ సినిమా స్పెషల్ షో ప్రదర్శించనున్నారు. ఇక ఈ స్పెషల్​ స్ర్కీనింగ్​లోనే సీక్వెల్​కు సంబంధించిన వీడియో టీజర్​ను లాంచ్​ చేయనున్నారట. అయితే తమిళ మూవీకి ట్రాక్ క్లియర్ అయ్యిందంటే.. తెలుగులో చెర్రీతోనూ చర్చలు జరిపే ఉంటారని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Chiranjeevi God father : మెగాస్టార్ చిరంజీవితో.. దర్శకుడు మోహన్ రాజా ఇదివరకే పనిచేశారు. వీరి కాంబినేషన్​లో 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందింది. అయితే ఈ సినిమా సమయంలోనే మోహన్ రాజా మెగా ఫ్యామిలీకి దగ్గరయ్యారు. అప్పుడే ధృవ సీక్వెల్​కు సంబంధించి చర్చలు జరిగాయట. మరి తెలుగు సీక్వెల్​పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ప్రస్తుతం చెర్రీ.. స్టార్ డైరెక్టర్ శంకర్​తో 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్​ చరణ్​ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్​గా నటిస్తోంది. నటి అంజ‌లి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, న‌వీన్ చంద్ర‌, సునీల్, జ‌య‌రాయ్‌ తదితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

'ఏజెంట్'​ కోసం వెతుకుతున్న 'ధృవ'.. ఇది కూడా అందులోని భాగమేనా?

Dil Raju Game Changer Movie Update : అదేంటి.. ఆ విషయం దిల్​ రాజుకు కూడా తెలియదా?

Last Updated : Aug 28, 2023, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.