ETV Bharat / entertainment

చెర్రీ సినిమాలో విలన్​గా విజయ్ సేతుపతి! భలే ప్లాన్ చేశారుగా.. ఇక థియేటర్లలో ఫ్యాన్స్​కు పూనకాలే - రామ్​చరణ్ బుచ్చిబాబు సినిమా షూటింగ్

Ram Charan Buchi Babu Movie : మెగాపవర్ స్టార్ రామ్​చరణ్ - బుచ్చిబాబు సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సినీవర్గాల్లో హాట్​ టాపిక్​గా మారింది. మరి అదేంటంటే..

Ram Charan Buchi Babu Movie
రామ్​చరణ్​ బుచ్చిబాబు సినిమాఅప్డేట్
author img

By

Published : Aug 18, 2023, 5:57 PM IST

Updated : Aug 18, 2023, 6:50 PM IST

Ram Charan Buchi Babu Movie : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్ తేజ్ - ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆయితే తాజాగా ఈ సినిమాపై ఓ బజ్​ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో నటించే తారాగణానికి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి వైరల్​గా మారింది. అదేంటంటే..

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్​లో చేరనున్నారని సినివర్గాల్లో టాక్ వినిపిస్తోంది. హీరో రామ్​చరణ్​కు ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించనున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కెరీర్​లో పలు నెగిటివ్ పాత్రల్లో నటించి.. మంచి క్రేజ్​ సంపాదించుకున్నారు విజయ్. ఇక ఈ సినిమాలో ఆయన నటిస్తే.. రామ్​చరణ్​ - విజయ్​ను ఒకేసారి తెరపై చూడవచ్చని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన 'ఉప్పెన' సినిమాలో విజయ్ నెగిటివ్ పాత్రలో మెరిశారు. ఆ సినిమాలో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్​లో నటించిన విజయ్​కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో బుచ్చిబాబు.. రామ్​చరణ్​కు ప్రతినాయకుడి పాత్ర కోసం విజయ్​ను సినిమాలోకి తీసుకురావడం పక్కా అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. కానీ మూవీమేకర్స్​ నుంచి ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Vijay Sethupathi Negative Roles : నటుడు విజయ్ సేతుపతి ఇప్పటికే విలన్​ పాత్రలు చేయడం ప్రారంభించారు. కమల్​ హాసన్ 'విక్రమ్' సినిమాలో విజయ్ పాత్రకు సపరేట్ ఫ్యాన్​బేస్ ఉంది. ఈ సినిమాలో విజయ్ పాత్ర.. హీరోకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. తమిళంలో దళపతి విజయ్ నటించిన​ 'మాస్టర్'లో నెగిటివ్ షేడ్​ క్యారెక్టర్​లో సేతుపతి అదరగొట్టారు. ఇక బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాలో కూడా విలన్​ రోల్​లో నటించారు విజయ్. ఈ సినిమా సెప్టెంబర్​లో విడుదలకానుంది.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ప్రముఖ నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్​.. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్​లో రూపొందించనున్నారని సమాచారం. కాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్​ రెహమాన్ దాదాపు ఓకే ఆయ్యారట.

Ram Charan Game Changer : రామ్ చరణ్ "గేమ్ ఛేంజర్".. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..!

చెర్రీతో ప్రభాస్ మూవీ... స్వయంగా ప్రకటించిన డార్లింగ్.. ఫ్యాన్స్​కు పండగే

Last Updated : Aug 18, 2023, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.