ETV Bharat / entertainment

రూ.1,500 కోట్ల బడ్జెట్​తో మహేశ్​, రాజమౌళి సినిమా- రూ.100 కోట్లతో ప్రత్యేక సెట్! - Mahesh next movie

Rajamouli Mahesh Movie : దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్​ బాబు సినిమాకు సంబంధించిన కొన్ని క్రేజీ విషయాలు​ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని రూ.1500 కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరిన్ని వివరాలు మీకోసం.

Rajamouli Mahesh Movie
Rajamouli Mahesh Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 4:36 PM IST

Updated : Jan 2, 2024, 5:46 PM IST

Rajamouli Mahesh Movie : దిగ్గజ దర్శకుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్​ బాబు కాంబినేషన్​లో ఓ మూవీ రాబోతోంది. అయితే ఈ సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అప్డేట్స్​ రాలేదు. కానీ ఈ సినిమా గురించి తరచూ పలు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను రూ.1,500 కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక సెట్​ ఏర్పాటు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అటు మహేశ్​ బాబు గానీ, ఇటు రాజమౌళి గానీ అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్​లో ప్రారంభమవుతుందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. దీనిపై కూడా చిత్ర యూనిట్ స్పందించలేదు.

'ప్రపంచాన్ని చుట్టే సాహసికుడి కథ'
ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ కాన్సెప్ట్​తో ఉంటుందని గతంలో రాజమౌళి, ఆయన తండ్రి రచయిత విజయేంద్రప్రసాద్​ చెప్పారు. మహేశ్‌ ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్ అని, అలాగే ఈ సినిమా కథ ఎంతో సాహసోపేతమైన కథ అని తెలిపారు. విజయేంద్ర ప్రసాదే ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఈ చిత్రాన్ని అగ్ర తారాగణంతో రూపొందించనున్నారట.

హాలీవుడ్ స్టార్స్​ కూడా!
ఈ సినిమాలో నటీనటులపై ఇప్పటికే పలు ఊహాగానాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఓ కోలీవుడ్ స్టార్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తారని వార్తలు వచ్చాయి. ఎక్స్​ఎక్స్​ఎక్స్​, కెప్టెన్​ మార్వెల్​, స్టార్​ వార్స్​, జురాసిక్​ పార్క్​, స్పైడర్​ మ్యాన్, అవెంజర్స్​, కెప్టెన్​ అమెరికా​​ వంటి హిట్​ చిత్రాల్లో నటించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు శామ్యూల్​ ఎల్​ జాక్స్​తో పాటు అవెంజర్స్​ థోర్​ ఫేమ్ క్రిస్ హెమ్స్ వర్త్ కీలక పాత్రలు చేయబోతున్నట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇక మహేశ్​కు జోడీగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్​, ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె నటిస్తున్నారంటూ పలువరి పేర్లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఒకవేళ ఇవన్నీ జరిగితే ఈ సినిమా రికార్డులు బద్దలుగొట్టడం ఖాయం అని అభిమానులు​ అభిప్రాయపడుతున్నారు.

సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్​ న్యూస్.. మహేశ్‌-రాజమౌళి ప్రాజెక్ట్‌ క్రేజీ అప్డేట్​..!

రాజమౌళితో సినిమా.. ఆ విషయంలో మహేశ్​దే తుది నిర్ణయం​

Last Updated : Jan 2, 2024, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.