Pushpa Part 2 Srivalli: 'పుష్ప'.. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్‌ను ఓ రేంజ్లో షేక్ చేసింది. తెలుగు, మలయాళం, హిందీతోపాటు మిగిలిన భాషల్లో మంచి టాక్‌తో పాటు కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా బన్నీ మాస్గెటప్, నటన, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. స్టార్ హీరోయిన్ సమంత చిందులేసిన 'ఊ అంటావా మావ' స్పెషల్ సాంగ్ దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కన్నడ భామ రష్మిక ఈ చిత్రంలో శ్రీవల్లిగా డీ గ్లామర్ పాత్రలో నటించి.. ఓ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకుంది. ఇక, 'పుష్ప 2' షూటింగ్ కూడా త్వరలోనే షురూ కానున్నట్టు వార్తలు ఇప్పటికే వచ్చాయి. తాజాగా 'పుష్ప 2'కు సంబంధించి మరో వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఈ సినిమాలో రష్మిక పాత్ర కథకు అంత కీలకం కాకపోయినప్పటికీ.. ఆమె గ్లామర్‌షో సినిమాకు బాగానే వర్కౌట్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప రెండో పార్ట్ 'పుష్ప: ది రూల్'లో మాత్రం సుకుమార్.. రష్మిక పాత్రను చాలా వరకు కట్ చేశారట. ఎందుకంటే పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ సిండికేట్ చూసుకోవడంలో భాగంగా అడవుల్లోనూ, కొన్ని ఆసియా దేశాల్లోనూ స్మగ్లింగ్ డీల్స్ మాట్లాడడానికి తిరిగే అవకాశాలు ఉన్నాయట. ఈ నేపథ్యంలో పోలీసులు.. పుష్పరాజ్‌ను పట్టుకోవడం కోసం శ్రీవల్లిని ఉపయోగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అంతేకాకుండా.. శ్రీవల్లి పాత్రను చంపేసే అవకాశం కూడా ఉందని సమాచారం. విలన్లు సునీల్, అనసూయ పాత్రలను మరింత పెంచుతారని టాక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ కూడా లాక్ అయిందట. ఇక పుష్ప మూడో భాగం తీసే ఆలోచన సుకుమార్‌కు లేదని.. కానీ రెండో పార్ట్‌లో మాత్రం శ్రీవల్లి పాత్ర మృతితో ఒక ఎమోషనల్ క్లైమాక్స్ ఉండబోతుందని తెలిసింది.
ఇవీ చదవండి: కళ్లు చెదిరే రెమ్యునరేషన్లు.. నయన్, సామ్ టాప్.. ఆ తర్వాత ఎవరంటే?
తమిళ స్టార్ డైెరెక్టర్‌తో తారక్ మూవీ!.. 'విజయ్ 66' అదిరే అప్డేట్