ETV Bharat / entertainment

ప్రభాస్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. సినిమాల విడుదలపై క్లారిటీ! - సమంత శాంకుంతలం మూవీ రిలీజ్ డేట్ న్యూస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. 'ఆదిపురుష్‌', 'సలార్' సినిమాలు విడుదల తేదీలను ప్రకటించారు. మరోవైపు సమంత నటిస్తున్న 'సిటాడెల్' వెబ్​సిరీస్ సెట్లోకి సమంత అడుగుపెట్టింది.

prabhas upcoming movies  release dates
ప్రభాస్, సమంత
author img

By

Published : Jan 23, 2023, 6:58 AM IST

అగ్ర తారలు నటిస్తున్నవి అందులోనూ విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రాల విడుదల తేదీల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఊహించలేని పరిస్థితి ఇప్పుడు. ఆయా సినిమాల చిత్రీకరణల్లోనూ నిర్మాణానంతర పనుల్లోనూ ఏమాత్రం ఆలస్యం చోటు చేసుకున్నా అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టం. కొన్నేళ్లుగా ప్రభాస్‌ సినిమాలు అలా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. 'ఆదిపురుష్‌' జూన్‌ 16న, 'సలార్‌' సెప్టెంబరు 28న అంటూ ఇప్పటికే విడుదల తేదీలు ప్రకటించారు.

ఆ మేరకు పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పుడు మరోసారి ఆ చిత్ర బృందాలు విడుదల తేదీల్ని పక్కా చేశాయి. కౌంట్‌డౌన్‌ని మొదలుపెడుతూ ఈ నెల 17న 'ఆదిపురుష్‌' బృందం మరో 150 రోజుల్లో సినిమా రాబోతోందని ప్రకటించింది. శనివారం 'సలార్‌' బృందం కూడా మరో 250 రోజుల్లో సినిమా విడుదల కానుందని తెలిపింది. దాంతో ఆయా సినిమాల కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్‌ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్‌' ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న 'సలార్‌' చిత్రీకరణ జరుపుకొంటోంది.

మయోసైటిస్‌ వ్యాధి కారణంగా చిత్రీకరణల నుంచి విరామం తీసుకొని కొన్నాళ్లుగా ఇంటిపట్టునే ఉంటున్న సమంత.. ఇప్పుడు మళ్లీ సెట్లోకి అడుగు పెట్టారు. ఆమె ప్రస్తుతం రాజ్‌-డీకే దర్శకత్వంలో 'సిటాడెల్‌' వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్‌ ధావన్‌ కథానాయకుడు. ఈ వెబ్‌సిరీస్‌ చిత్రీకరణ కోసం వరుణ్‌తో కలిసి ముంబయిలోని సెట్లోకి అడుగు పెట్టారు సామ్‌. ఈ విషయాన్ని వరుణ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇది హాలీవుడ్‌ షో 'సిటాడెల్‌'కు రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో వరుణ్‌ ధావన్‌, సమంత గూఢచారి పాత్రల్లో కనిపించనున్నారు. ఇక సామ్‌, విజయ్‌ దేవరకొండ కలిసి నటిస్తున్న 'ఖుషీ' చిత్రం వచ్చే నెల నుంచి పునఃప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సమంత ఇప్పటికే డేట్లు కేటాయించిందని సమాచారం. మరోవైపు ఆమె నటించిన 'శాకుంతలం' వచ్చే నెల 17న విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.