ETV Bharat / entertainment

ప్రభాస్​-మారుతి ప్రాజెక్ట్​ క్రేజీ అప్డేట్​.. సెట్స్​పైకి వెళ్లేది అప్పుడే! - ప్రభాస్ మారుతి సినిమా అప్డేట్​

Prabhas maruti film update: ప్రభాస్‌- మారుతి కాంబోలో తెరకెక్కాల్సిన సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్​ షూటింగ్​ను ప్రారంభించుకోనున్నట్లు తెలిసింది. ఈ నెల 10నే చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నట్లు తెలిసింది.

prabhas
ప్రభాస్​
author img

By

Published : Apr 4, 2022, 7:31 AM IST

Prabhas maruti film update: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్‌- దర్శకుడు మారుతి కాంబినేషన్​ సినిమా కోసం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 10నే చిత్రాన్ని కొబ్బరికాయ కొట్టి పూజాకార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. వచ్చే నెల నుంచే రెగ్యులర్​ షూటింగ్​ షురూ కానుంది. స్క్రిప్టు పనులు దాదాపుగా తుది దశకు చేరాయి. హారర్‌ కథతో, మారుతి మార్క్‌ వినోదంతో ఈ చిత్రం రూపొందనున్నట్టు తెలిసింది.

ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారు. ఇప్పటికే పలువురు భామల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. ప్రభాస్‌ అభిమానుల్ని అలరించడమే లక్ష్యంగా రూపొందనున్న ఈ సినిమా వేగంగానే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి: ఆ సినిమా కాస్ట్యూమ్స్​ బడ్జెట్​ రూ.100 కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.