ETV Bharat / entertainment

దీపిక కోసం నిర్మాతలకు ప్రభాస్​ విజ్ఞప్తి.. ఎంతైనా 'డార్లింగ్' కదా..! - ప్రాజెక్టు కె

Prabhas Deepika Padukone: మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు డార్లింగ్ ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో బాలీవుడ్​ బ్యూటీ దీపికా పదుకొణెతో కలిసి ఆయన నటిస్తున్న చిత్రం 'ప్రాజెక్ట్ కె'. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఇటీవలే దీపిక అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె కోలుకునేందుకు వీలుగా షూటింగ్​ను వారం పాటు వాయిదా వేయాలని నిర్మాతలను కోరారట ప్రభాస్.

Project K
Prabhas Deepika Padukone
author img

By

Published : Jun 17, 2022, 9:29 PM IST

Prabhas Deepika Padukone: పాన్​ఇండియా స్టార్ ప్రభాస్​-బాలీవుడ్ లేడీ సూపర్​స్టార్ దీపికా పదుకొణె కలిసి నటిస్తున్న చిత్రం 'ప్రాజెక్టు కె'. ప్రస్తుతం హైదరాబాద్​లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్​లో భాగంగా ఇటీవలే దీపిక అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో షూటింగ్​ నుంచి నేరుగా ఆమె ఆస్పత్రికి వెళ్లారని సమాచారం.

Project K
దీపిక

ఈ క్రమంలోనే దీపిక కోసం నిర్మాతలకు ఓ విన్నపం చేశారట ప్రభాస్. అనారోగ్యం నుంచి ఆమె కోలుకోవడానికి వీలుగా షూటింగ్​ షెడ్యూల్​ను ఓ వారం పాటు వాయిదా వేయాల్సిందిగా నిర్మాతలను ప్రభాస్ కోరినట్లు సమాచారం.

Project K
దీపికా పదుకొణె

దీపిక-ప్రభాస్​ కాంబినేషన్​లో వస్తున్న తొలి సినిమా ఇదే. దీపిక తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. ఈ సినిమాలో బిగ్​బీ అమితాబ్​ బచ్చన్, దిశా పటానీ కీలకపాత్రలో నటించనున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'మహానటి' ఫేం నాగ్​ అశ్విన్ దర్శకుడు.

Project K
దీపిక

ఇదీ చూడండి: దీపికకు అస్వస్థత.. 'ప్రాజెక్ట్​ కే' షూటింగ్​ నుంచి హడావుడిగా ఆసుపత్రికి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.