ETV Bharat / entertainment

Prabhas Anushka Promotions : స్వీటీ కోసం డార్లింగ్​ ఎంట్రీ ​.. ఇంతకీ స్పెషల్​ ఏంటంటే ? - మిస్​ శెట్టి మిస్టర్​ పోలిశెట్టి ప్రమోషన్స్​

Prabhas Anushka Promotions : టాలీవుడ్​ బ్యూటీ అనుష్క శెట్టి, యంగ్​ హీరో నవీన్​ పోలిశెట్టి కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'. సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ యూనిట్​ ప్రమోషనల్​ ఈవెంట్స్​ను వేగవంతం చేసింది. ఈ క్రమంలో అటు నవీన్​తో పాటు ఇటు అనుష్క సినిమాను ప్రమోట్ చేస్తున్న క్రమంలో అనుష్క కోసం ప్రభాస్​ రంగంలోకి దిగారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..

Prabhas Anushka
Prabhas Anushka
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 12:58 PM IST

Prabhas Anushka Promotions : టాలీవుడ్​ బ్యూటీ అనుష్క శెట్టి, యంగ్​ హీరో నవీన్​ పోలిశెట్టి కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'. యూవీ క్రియేషన్స్​ బ్యానర్​పై పి.మహేష్‌బాబు తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్​ ప్రమోషనల్​ ఈవెంట్స్​ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా హీరో నవీన్​.. పలు ప్రదేశాలకు తిరిగి సినిమాను ప్రమోట్​ చేస్తుండగా.. హీరోయిన్​ అనుష్క కూడా వినూత్నంగా ప్రమోట్​ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఈ సారి అనుష్క కోసం ప్రభాస్​ రంగంలోకి దిగారు. ఆయన చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే..

'మిస్​ శెట్టి మిస్టర్​ పోలిశెట్టి' సినిమాలో అనుష్క చెఫ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలో అనుష్క ..తనకు ఇష్టమైన వంటకం తయారీ విధానాన్ని సోషల్​ మీడియాలో షేర్‌ చేశారు. అందులో భాగంగా మంగుళూరు చికెన్‌ కర్రీ, నీర్‌ దోశ ఎలా చేయాలో తెలిపారు. అలా #MSMPRecipeChallenge ను నెట్టింట స్టార్ట్​ చేశారు.

Anushka Neer Dosa Recipie : "నేను ఈ సినిమాలో చెఫ్‌ పాత్రలో కనిపించనున్నాను.. అందుకే నాకు ఇష్టమైన వంటకాలను మీతో పంచుకుంటున్నాను. దీంతో ఓ కొత్త ఛాలెంజ్‌ను మొదలు పెడుతున్నాను. అందులో భాగంగా మొదట ఈ ఛాలెంజ్​లో ప్రభాస్‌ పాల్గొవాలని నేను కోరుకుంటున్నాను. భోజనాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తి.. అలాగే అతిథులను భోజనాలతో ఆశ్చర్యపరిచే వ్యక్తి ప్రభాస్‌. ఇప్పుడు తనకు ఇష్టమైన వంటకాన్ని ఎలా తయారు చేస్తారో ఆయన పోస్టు పెట్టాలి" అంటూ ప్రభాస్​ను ట్యాగ్‌ చేశారు అనుష్క.

Prabhas Latest Instagram Post : ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన డార్లింగ్.. వెంటనే ఇన్‌స్టాలో తన ఫేవరట్​ రెసిపీని పోస్ట్‌ చేశారు. రొయ్యల పులావ్‌ అంటే ఇష్టమంటూ తెలిపిన ఆయన..దానికి సంబంధించిన తయారీ విధానాన్ని ఫ్యాన్స్​తో పంచుకున్నారు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్‌ను రామ్‌ చరణ్‌కు విసురుతున్నట్లు చెప్పారు.

"నాకు స్వీటీ (అనుష్క) ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. కానీ తనకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటో ఇప్పుడే తెలిసింది. నేను తన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను. అలాగే నాకు ఇష్టమైన రొయ్యల పులావ్‌ను ఎలా చేయాలో మీతో పంచుకుంటున్నాను. ఇక రామ్ చరణ్‌ దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను" అంటూ చెర్రీని ట్యాగ్‌ చేశారు. అలాగే అభిమానులు కూడా వారికి ఇష్టమైన వంటకాలను పంచుకోవాల్సిందిగా ప్రభాస్‌ కోరారు.

ప్రస్తుతం ఈ ఛాలెంజ్​ నెట్టింట తెగ ట్రెండ్​ అవుతోంది. అయితే అనుష్క ఇచ్చిన ఛాలెంజ్​ను స్వీకరించి ప్రభాస్​ తన ఫేవరెట్​ రెసిపీని పోస్ట్​ చేయడం ఫ్యాన్స్​కు ఆనందాన్ని ఇచ్చింది. దీంతో వారిద్దరి పోస్ట్​లపై ఫ్యాన్స్​ స్వీట్​ కామెంట్స్​ పెడుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Anushka Naveen Polishetty : నవీన్​ పొలిశెట్టికి అనుష్క ప్రాంక్ కాల్​.. ఓ రేంజ్​లో ఆటాడేసుకుందిగా!.. మీరు విన్నారా?

Anushka Shetty Marriage News : పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన అనుష్క.. అప్పుడే చేసుకుంటుందట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.