ETV Bharat / entertainment

2023లో ఈ పాటలదే హవా - వన్స్​ మోర్​ అంటున్న మ్యూజిక్​ లవర్స్​

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 10:08 AM IST

Popular Tollywood Songs of the Year 2023 : ఈ ఏడాది కొన్ని బ్లాక్​ బస్టర్​ సినిమాలతో పాటు సూపర్ హిట్ సాంగ్స్​ నెట్టింట సందడి చేశాయి. ఇన్​స్టా రీల్స్​ రూపంలో ట్రెండ్ అయ్యాయి. అలాంటి వాటిని వన్స్​మెర్ అంటూ మ్యూజిక్ లవర్స్​ కూడా లూప్​లో వింటున్నారు. ఇంతకీ ఈ ఏడాది పాపులర్ సాంగ్స్ లిస్ట్​లో ఉన్న టాలీవుడ్ పాటలు ఏవంటే?

Etv Bharat
Etv Bharat

Popular Tollywood Songs of the Year 2023 : ఓ సిినిమా అంటే అందులోని స్టోరీ, స్టార్స్​తో పాటు సాంగ్స్​ కూడా పాపులర్​ అవుతుంటాయి. కొన్ని సార్లు సినిమాలు అభిమానులను నిరాశపరిచినా అందులోని సాంగ్స్​ బ్లాక్​బస్టర్​గా నిలుస్తుంటాయి. అలా కొన్ని పాటలను వన్స్‌మోర్‌ అంటూ మళ్లీ మళ్లీ వింటుంటాం. అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కొన్ని పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అవేంటంటే?

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'వీరసింహారెడ్డి'లో హీరో బాలకృష్ణ పేరు మీద వచ్చిన 'జై బాలయ్యా' సాంగ్​ ఎంత పాపులరైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ పాట అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు బాలయ్య ఫ్యాన్స్​తో పాటు మ్యూజిక్​ లవర్స్ నోట నానుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్​కు దాదాపు నాలుగు కోట్ల వ్యూవ్స్​ దాటాయి. ఇక ఇదే సినిమాలో 'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే' అనే సాంగ్​ కూడా రెండు కోట్ల వ్యూస్‌ అందుకుని ట్రెండింగ్​లో ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇక సంక్రాంతి రేసులోకి ఎంట్రీ ఇచ్చిన మరో మూవీ 'వాల్తేరు వీరయ్య' ఇందులోని పాటలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. 'వేరీజ్‌ ద పార్టీ','పూనకాలు లోడింగ్‌' సాంగ్స్​ ఇప్పటికీ నెట్టింట ట్రెండ్ అవుతూ దాదపు నాలుగు కోట్ల ఇరవై లక్షల వీక్షకుల్ని అందుకున్నాయి.

'దసరా'లోని 'చమ్కీల అంగీలేసి ఓ వదినే' అనే పాట క్రియేట్ చేసిన సెస్సేషన్ అంతా ఇంతా కాదు. కేవలం గ్లింప్స్​తోనే ఆ పాట అందరి నోట నానగా, ఆ తర్వాత రీల్స్​లోనూ తెగ ట్రెండ్​ అయ్యి అందరీ ఫేవరెట్​గా మారిపోయింది. ఇక ఈ పాట పాడిన డీ కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ పాట సుమారు పన్నెండు కోట్ల వ్యూస్‌తో రికార్డుకెక్కింది. మరోవైపు ఇదే సినిమాలో 'ధూంధామ్‌ దోస్తాన్‌' పాట కూడా సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

ఈ ఏడాది చివర్లో వచ్చిన 'కోటబొమ్మాళి పీఎస్‌'లోని 'లింగిలింగి లింగిడి' సాంగ్​కు సూపర్​ రెస్పాన్స్​ వచ్చింది. ఇందులోని లిరిక్స్​, మ్యూజిక్​కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. దీంతో ఎక్కడ చూసిన ఈ పాట తెగ ట్రెండ్ అయ్యింది. ఈ సాంగ్​ సుమారు అయిదుకోట్ల వ్యూవర్స్​ను అందుకుంది. ఇక కిరణ్ అబ్బవరం లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'రూల్స్‌ రంజన్‌'లో 'సమ్మోహనుడా' సాంగ్​కు మంచి గుర్తింపు లభించింది.

రౌడీ హీరో విజయ్​ దేవరకొండ, సమంత లీడ్​ రోల్స్​లో వచ్చిన క్లాసిక్ మూవీలో సాంగ్స్ కూడా అంతే క్లాసిక్​గా ఉన్నాయి. ఇందులోని 'నా రోజా నువ్వే' పాట క్యాచీ లిరిక్స్​తో అందరి చేత వావ్‌ అనిపించింది. ఇక ఈ సినిమాలోని 'ఆరాధ్య ' సాంగ్​ కూడా మ్యూజిక్​ లవర్స్​ను తెగ ఆకట్టుుకుంది. మరోవైపు 'భగవంత్‌ కేసరి'లోని 'ఉయ్యాలో ఉయ్యాలా' సాంగ్​కు సుమారు మూడున్నర కోట్లకు పైగా వ్యూస్‌ వచ్చింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్​తో మెలోడియస్​ ఉన్న ఈ సాంగ్​ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.

ఇక చిన్న చిత్రంగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన 'బలగం' సినిమాలో 'ఊరూ పల్లెటూరు', 'పొట్టి పిల్లా'తో పాటు దాదాపు అన్ని పాటలకు మంచి ఆదరణ లభించింది. అలాగే యూత్​ను ఆకట్టుకుని తెగ పాపులరైన 'బేబీ' చిత్రంలో 'దేవరాజ సేవ్యమూర్ధని కీర్ణలోచనే', 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' సాంగ్స్​ సైతం శ్రోతలకు తెగ నచ్చేశాయి. ఇక ప్రభాస్‌ లీడ్​ రోల్​లో వచ్చిన 'ఆదిపురుష్‌'లో 'జై శ్రీరాం జై శ్రీరాం.. రాజారామ్‌'ను పన్నెండు కోట్ లమందికి పైగా చూశారు. ఇందులోని మిగతా పాటలకు కూడా విశేషాదరణ లభించింది.

మరోవైపు ధనుశ్​ లీడ్​ రోల్​లో వచ్చిన 'సార్‌'లోని టశీతాకాలం మనసూ నీ మనసున చోటడిగిందే' అలాగే సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటించిన 'జైలర్‌' సినిమాలోని 'నువ్వు కావాలయ్యా' సాంగ్​కు పాటలు మ్యూజిక్​ లవర్స్​లో మంచి క్రేజ్​ సంపాదించింది. ఇక విజయ్‌ హీరోగా వచ్చిన 'వారసుడు'లో 'రంజితమే', 'చెమికీ కన్ను', అలాగే 'లియో'లో 'నే రెడీ' అనే పాటలకు సోషల్ మీడియాలో మంచి వ్యూవ్స్​ వచ్చింది.

Waltair Veerayya: అదిరిపోయిన 'పూనకాలు లోడింగ్‌' సాంగ్​​.. చిరు స్టెప్పులు సూపరహే!

జై బాలయ్య సాంగ్ ఎన్ని సినిమాల్లో ఉందో తెలుసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.