ETV Bharat / entertainment

అదీ పవన్​ రేంజ్​.. ఆ సినిమాకు భారీ రెమ్యునరేషన్​.. ఎంతో తెలిస్తే.. - పవన్​కల్యాణ్​ వినోదయ సీతమ్

Pawankalyan Remuneration: పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ రెమ్యునరేషన్ విషయం​ మరోసారి తెరపైకి వచ్చింది. 'వినోదయ సీతమ్'​ చిత్రానికి ఆయన తీసుకోబోయే పారితోషికం ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది. ఎంత తీసుకుంటున్నారంటే...

Pawankalyan remuneration
పవన్ రెమ్యునరేషన్​
author img

By

Published : Jun 30, 2022, 10:31 AM IST

Pawankalyan Remuneration: టాలీవుడ్​లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్​ హీరోల్లో పవన్​కల్యాణ్​ ఒకరు. అయితే ఇప్పుడు ఆయనకు మరింత ఎక్కువ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారని టాక్​. ప్రస్తుతం ఈ విషయం సోషల్​మీడియాలో హాట్​టాపిక్​గా మారింది.

పవన్​ నటించనున్న సినిమాల్లో 'వినోదయ సీతమ్​' రీమేక్​ ఒకటి. నటుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'వినోదయ సీతమ్'​ తమిళంలో సూపర్​ హిట్​ను అందుకుంది. తెలుగులోనూ ఆయనే డైరెక్ట్​ చేయనున్నారు. అయితే ఈ మూవీ కోసం పవన్​.. 20రోజుల పాటు కాల్​ షీట్స్​ ఇచ్చారని, రూ.50కోట్లు రెమ్యునరేషన్​ తీసుకోనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏంటంటే.. మరో పది కోట్లు ఎక్కువ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారట. అంటే పవన్​ రెమ్యునరేషన్​ రోజుకు రూ.3కోట్లు అన్న మాట. ప్రస్తుతం ఈ విషయం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.

కాగా, 'వినోదయ సీతమ్' రీమేక్‌లో పవన్‌తో పాటు ఆయన మేనల్లుడు హీరో సాయి తేజ్ కూడా నటిస్తున్నారు. 'భీమ్లానాయక్'​కు స్క్రీన్​ ప్లే, డైలాగ్స్​ అందించిన త్రివిక్రమ్​ ఈ చిత్రానికి కూడా రాయనున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇదీ చూడండి: రూ.100కోట్ల బంగ్లా.. ప్రైవేట్ జెట్.. అబ్బో నయన్ లైఫ్ స్టైల్​ సూపరహే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.