ETV Bharat / entertainment

పవన్​కల్యాణ్​తో మల్టీస్టారర్​ సినిమా.. ​చరణ్​ ఏమన్నారంటే? - పవన్​కల్యాణ్ ఆచార్య సినిమా

Pawankalyan Ramcharan movie: పవన్​కల్యాణ్​-రాణ్​చరణ్​ను ఒకే తెరపై చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా 'ఆచార్య' సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ​చరణ్​.. పవన్​తో మల్టీస్టారర్​ సినిమా చేయడంపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

pawankalyan ramcharan multistarre movie
పవన్​కల్యాణ్​ రామ్​చరణ్​ మల్టీస్టారర్​
author img

By

Published : Apr 25, 2022, 8:57 AM IST

Pawankalyan Ramcharan movie: మెగాస్టార్​ చిరంజీవి-రామ్​చరణ్​ కలిసి పూర్తిస్థాయి పాత్రలో ఒకే తెరపై కనపడాలన్న అభిమానుల కోరిక 'ఆచార్య'తో తీరబోతుంది. అయితే పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​-చరణ్​ను కూడా ఒకే స్క్రీన్​పై చూడాలని మెగా ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఆచార్య' సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ​చరణ్​.. ఈ పవర్​ఫుల్​ కాంబోను త్వరలోనే తెరపై చూస్తారని అన్నారు.

"బాబాయ్​తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నా. సరైన కథ కోసం ఎదురుచూస్తున్నా. కథ కుదిరినప్పుడు కచ్చితంగా సినిమా ఉంటుంది. ఆ చిత్రాన్ని నేనే నిర్మించవచ్చు. ఇక నా బ్యానర్​లో బాబాయ్​, ఆయన బ్యానర్​లో నేను నటించాలని అనుకుంటున్నాం." అని చరణ్ అన్నారు.

ఇక 'ఆచార్య' సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ మూవీ మెగా ఫ్యాన్స్​కు ఫీస్ట్​లా ఉంటుందని చరణ్​ పేర్కొన్నారు. దీంతో పాటు "బాలీవుడ్​లో సినిమాలు చేస్తారా?" అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు చెర్రీ. " హిందీ డైరెక్టర్​ అని కాదు.. కథ బాగుంటే చేస్తాను. ఈ మధ్య ఓ బడా దర్శకుడు వచ్చి మూడు, నాలుగు కథలు ఉన్నాయని చెప్పారు. నాకు ఛాయిస్​ ఇవ్వకండి. నేను ఏ కథకు సెట్ అవుతానో మీరే డిసైడ్​ అవ్వండి అని ఆయనతో అన్నాను." అని చరణ్​ వెల్లడించారు.

ఇదీ చూడండి: 'ఆయన సహకారం వల్లే 'ఆచార్య' సెట్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.