ETV Bharat / entertainment

'బ్రో'.. సాయి తేజ్​ 'మార్క్'​ లుక్ అదిరింది.. మోషన్​ పోస్టర్​ చూశారా? - బ్రో మూవీ సాయితేజ్ లుక్​ మోషన్ పోస్టర్​ రిలీజ్​

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్​ నటిస్తున్న 'బ్రో' సినిమా నుంచి సాయితేజ్​ పాత్రను పరిచయం చేస్తూ ఆయన లుక్​ను రిలీజ్ చేశారు మేకర్స్​. మోషన్​ పోస్టర్​ను కూడా విడుదల చేశారు. మీరు చూశారా?​

Pawankalyan Bro movie Sai tej Mark look released
'బ్రో'.. సాయి తేజ్​ 'మార్క్'​ లుక్ అదిరింది
author img

By

Published : May 23, 2023, 5:53 PM IST

Updated : May 23, 2023, 6:40 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మెగా మేనల్లుడు, యంగ్​ హీరో సాయి తేజ్ కలిసి 'వినోదయ సీతం' రీమేక్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్టర్​ కమ్​ డైరెక్టర్​ సముద్రఖని దీనికి దర్శకుడు. రీసెంట్​గా ఈ చిత్రానికి 'బ్రో' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి.. పవన్​ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్​ చేశారు మేకర్స్. దీనికి ఫ్యాన్స్​ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించిందని అంటున్నారు. దీంతో సినిమాపై ఆడియెన్స్​లో భారీగా అంచనాలను పెరిగాయి.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి సాయి తేజ్ ‌లుక్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. సాయి తేజ్​ను మార్క్​గా పరిచయం చేస్తూ.. ఆయన మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మూవీలో తేజ్​ మార్కండేయులు (మార్క్) పాత్ర పోషిస్తున్నారని మేకర్స్ తెలిపారు. ఇందులో సాయితేజ్ వైట్​ అండ్ వైట్​లో స్టైలిష్​గా నడుస్తూ కనిపించి ఆకట్టుకున్నారు. హ్యాండ్సమ్​గా కనిపించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సాయితేజ్​ బ్యాగ్రౌండ్​లో ఓ గడయారాన్ని కూడా హైలైట్​ చేస్తూ.. సినిమాకు సంబంధించి ఏదో హింట్​ ఇస్తున్నట్లుగా పోస్టర్​ను డిజైన్​ చేశారు.

ఇక సినిమా విషయానికొస్తే.. మాతృక(ఒరిజినల్ వెర్షన్)ను తెరకెక్కించిన యాక్టర్​ కమ్​ డైరెక్టర్​ సముద్రఖనినే ఈ రీమేక్​ను కూడా తెరకెక్కిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. పవన్, సాయి తేజ్​ ప్రధాన పాత్రలు పోషించగా.. ప్రియా ప్రకాశ్​ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. జి స్టూడియోస్ సమర్పిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై వివేక్ కూచిబోట్ల, టీజీ విశ్వప్రసాద్ కలిసి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ యాక్టర్స్​ తనికెళ్ల భరణి, బ్రహ్మానందం తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది చిత్రం. తమన్ సంగీతం అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పవన్ రెమ్యునరేషన్.. ఓటీటీ పార్ట్నర్​ ఫిక్స్​.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్​ మోడ్రన్​ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఈ చిత్ర ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయినట్టు తెలిసింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. శాటిలైట్ రైట్స్​ను జీ తెలుగు దక్కించుకుందని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని జులై 28న థియేటర్లలో గ్రాండ్​గా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తోంది మూవీటీమ్​.

ఇదీ చూడండి: రీ రిలీజ్ ట్రెండ్​.. 4K వెర్షన్ ఖర్చు ఎంతో తెలుసా?

Last Updated : May 23, 2023, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.