ETV Bharat / entertainment

'బ్రో' క్లైమాక్స్​లో త్రివిక్రమ్​ హ్యాండ్​.. అలా ఉండబోతుందట!

author img

By

Published : Jul 12, 2023, 10:25 AM IST

Pawankalyan bro movie : పవన్​కల్యాణ్​ 'బ్రో' మూవీ క్లైమాక్స్​ను దర్శకుడు త్రివిక్రమ్​ అలా తీర్చిదిద్దారని తెలిసింది. ఆ వివరాలు..

Trivikram
'బ్రో' క్లైమాక్స్​లో త్రివిక్రమ్​ హ్యాండ్​.. అలా ఉండబోతుందట!

trivikram bro movie : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు దాదాపుగా మంచి రెస్పాన్స్​ను అందుకుంటాయి. ఆయన చిత్రంలోని డైలాగ్స్​ సినీ అభిమానులను బాగా అలరిస్తుంటాయి. ముఖ్యంగా ఆయన చిత్రాల క్లైమాక్స్.. హైలైట్​గా నిలుస్తుంటాయి. తనదైనా స్టైల్​లో ఎంతో అద్భుతంగా, భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో రూపొందిస్తుంటారు.

అయితే సినీ ప్రియుల్లో పవన్-త్రివిక్రమ్​ కాంబోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. వారిద్దరి కాంబోలో వచ్చిన 'జల్సా', 'అత్తారింటికి దారేది' మంచి హిట్​ను అందుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన 'అజ్ఞాతవాసి' డిజాస్టర్​గా నిలిచినా.. అనంతరం 'భీమ్లానాయక్'​ మంచి హిట్​ను అందుకుంది. అయితే 'భీమ్లానాయక్'​కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించలేదు. స్క్రీన్​ ప్లే, మాటలు మాత్రమే అందించారు.

అయితే త్రివిక్రమ్ ఇప్పుడు.. పవన్ నటిస్తున్న 'బ్రో' చిత్రానికి కూడా మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ సినిమా 'వినోదయం సీతమ్'​కు రీమేక్​గా ఇది రూపొందుతోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా త్రివిక్రమ్​ దీన్ని తీర్చిదిద్దారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీ క్లైమాక్స్​ను కూడా తనదైన మార్క్​ స్టైల్​లో స్ట్రాంగ్ ఎమోషన్స్​తో మాటల మాంత్రికుడు​ తీర్చిదిద్దారని సమాచారం అందింది. పవన్​ ఇమేజ్​కు తగ్గట్టుగా.. అలాగే ఆడియెన్స్​, అభిమానుల మనసును తాకేలా క్లైమాక్స్​ సన్నివేశాలను, సంభాషణలను రూపొందించారట.

ఇకపోతే ఈ సినిమా ఒరిజినల్​ వెర్షన్​కు దర్శకత్వం వహించిన సముద్రఖనినే.. రీమేక్​కు కూడా దర్శకత్వం వహించారు. ఇంకా ఈ చిత్రంలో పవన్​ కల్యాణ్​తో పాటు మెగాహీరో సాయితేజ్​ కూడా ప్రధాన పాత్రలో నటించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించగా.. బ్రహ్మానందం, రోహిని మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్​ స్వరాలు సమకూర్చారు. జీ స్టూడియోస్​తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను గ్రాండ్​గా నిర్మించంది. ఈ చిత్రం జులై 28న విడుదల​ కానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్​, టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా రైట్స్​ కూడా భారీ ధరకు కొనుగోలు చేశారని టాక్ వినిపిస్తోంది.

ఇదీ చూడండి :

పవన్ 'బ్రో' టీజర్ వచ్చేసిందోచ్​.. మామ-అల్లుడు అదరగొట్టేశారు

Pawan Kalyan Bro Movie : మాస్​ లుక్​లో మామా అల్లుళ్లు.. ఆ స్పెషల్​ సాంగ్​ కోసమేనా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.