ETV Bharat / entertainment

మరోసారి రచయితగా మారిన పవన్​ కల్యాణ్​? - రచయితగా మారిన పవన్​ కల్యాణ్​

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​కు ఉండే క్రేజ్​ అంతా ఇంతా కాదు. అయితే ఆయన​ హీరోగానే కాకుండా తన చిత్రాలకు కథలను కూడా రాసుకున్నారు. ఈ నేపథ్యంతో తన కొత్త చిత్రం కోసం ఆయన మరోసారి రచయితగా మారుతున్నారని సమాచారం.

pawan kalyan
పవన్​ కల్యాణ్​
author img

By

Published : Nov 26, 2022, 1:01 PM IST

Pawan Kalyan Story Writer: ఇప్పుడున్న హీరోలు కేవ‌లం న‌ట‌న‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం లేదు. మిగిలిన విభాగాల్లోనూ త‌మ స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కొంత‌మంది హీరోలు నిర్మాణ రంగంలోకి అడుగుపెడితే.. మ‌రికొంద‌రు సొంతంగా క‌థ‌లు రాసుకుంటున్నారు. అయితే ఈ ఆచరణ ఇప్పుడేం కొత్తగా పుట్టుక రాలేదు. అప్పట్లో సీనియర్‌ ఎన్టీఆర్‌, కృష్ణ వంటి అగ్ర హీరోలు నటనతో పాటుగా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టేవారు. అంతేకాకుండా స్వయంగా కథలు కూడా రాసుకునేవారు.

తాజాగా పవన్‌ కల్యాణ్ కూడా తన సినిమాకు తానే కథను రాసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత పవన్‌, హరీశ్​ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా 'గబ్బర్‌సింగ్‌' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో 'భవదీయుడు భగత్‌సింగ్‌' తెరకెక్కాల్సి ఉంది.

మైత్రీ సంస్థ అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌ పలు కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా పవన్‌, హరీశ్ శంకర్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారట. అయితే ముందుగా అనుకున్న కథ కాకుండా కొత్త కథతో సినిమా తెరకెక్కించనున్నారట. అంతేకాకుండా ఈ సినిమాకు పవన్‌ కల్యాణ్ స్వయంగా కథను అందించనున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక పవన్‌ గతంలో 'జానీ', 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాలకు రచయితగా పనిచేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.