ETV Bharat / entertainment

అవును 'బ్రో'.. పవన్​-సాయి తేజ్ మూవీ టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్​ మ్యూజిక్​ హైలైట్​

author img

By

Published : May 18, 2023, 4:43 PM IST

Updated : May 18, 2023, 5:59 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయి తేజ్ కలిసి నటిస్తున్న 'వినోదయ సీతం' రీమేక్ టైటిల్​ను అనౌన్స్​మెంట్ చేశారు. అలాగే పవన్​ లుక్ మోషన్ పోస్టర్​ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మోషన్ పోస్టర్​కు తమన్ అందించిన బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్​ హైలైట్​గా ఉంది. మీరు చూశారా?

Pawan Kalyan  Sai Tej   Trivikram  Samuthirakani
పవన్​-సాయి తేజ్ మూవీ టైటిల్ ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మెగా మేనల్లుడు, యంగ్​ హీరో సాయి తేజ్ కలిసి 'వినోదయ సీతం' రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ గురించి గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా దీనికి సమాధానం దొరికేసింది. సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు పవన్​ లుక్ మోషన్ పోస్టర్​ను రిలీజ్ చేశారు మేకర్స్​. ఈ చిత్రానికి 'బ్రో' అనే టైటిల్ ఖరారు చేశారు. వాస్తవానికి కొన్ని రోజుల క్రితమే ఈ టైటిల్ ఫిక్స్ చేశారని సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ రోజు(మే 18) అధికారికంగా ఆ టైటిల్​ను అనౌన్స్ చేశారు మేకర్స్​. ముఖ్యంగా ఈ మోషన్ పోస్టర్​కు తమన్ అందించిన బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్​గా ఉంది. ఇది మెగా అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు పూనకాలు తెప్పించేలా ఉంది.

ఇకపోతే ఈ చిత్రానికి యాక్టర్​ కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన అంతకుముందు తెలుగులో మాస్ మహారాజా రవితేజ నటించిన 'శంభో శివ శంభో', నాని 'జెండా పై కపిరాజు' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు 'బ్రో'కు వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూలై 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్​కు హీరోయిన్​గా 'రొమాంటిక్' బ్యూటీ కేతికా శర్మ నటించనుంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర పోషిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కథ ఇదే.. తమిళంలో సముద్రఖని స్వీయదర్శకత్వంతో తెరకెక్కింది 'వినోదయ సీతం'. ఈ చిత్రాన్నే ఇప్పుడు 'బ్రో' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి.. దేవుడు రెండో అవకాశం ఇవ్వడమే ఈ చిత్ర కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రలో పవన్ కళ్యాణ్.. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిగా తేజ్ నటించనున్నారు. ఇకపోతే గతంలోనే పవన్ దేవుడి పాత్రలో మెరిశారు. 'గోపాల గోపాల'లో వెంకటేశ్ నాస్తికుడి పాత్ర పోషించగా.. పవన్​ మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర పోషించారు. ఇంకా పవన్​ 'బ్రో' సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీర మల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ-ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' సినిమాలు చేస్తున్నారు. వీటిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్​ కానుందని సమాచారం.

ఇదీ చూడండి: Bichagadu 2 : 'ఇదేం టైటిల్'​ అన్నారు.. కట్​ చేస్తే సంచలనం.. మరి ఇప్పుడేం చేస్తుందో?

Last Updated : May 18, 2023, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.