ETV Bharat / entertainment

OG Movie : పవన్​ కల్యాణ్​ మైండ్​ బ్లాక్ రెమ్యునరేషన్​.. ఎంతంటే? - పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్

Pawan Kalyan Remuneration : పవన్​కల్యాణ్​ నటిస్తున్న 'ఓజీ' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమాకు పవన్​ కల్యాణ్​ షాకింగ్ రెమ్యునరేషన్​ తీసుకోబోతున్నారట. ఆ వివరాలు..

Pawankalyan
OG Movie : పవన్​ కల్యాణ్​ మైండ్​ బ్లాక్ రెమ్యునరేషన్​.. ఎంతంటే?
author img

By

Published : May 31, 2023, 3:45 PM IST

Updated : May 31, 2023, 5:00 PM IST

Pawan Kalyan OG Movie : పవర్​ స్టార్​ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో 'OG' ఒకటి. 'ఒరిజినల్​ గ్యాంగ్​స్టర్​' ఉపశీర్షిక. సాహో ఫేమ్​ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కొంతకాలంగా ముంబయిలో జరుగుతోంది. ఇప్పటికే అక్కడ పవన్​కల్యాణ్​తో పాటు మరికొందరిపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోగా నటించే పవన్​ కల్యాణ్​ రెమ్యునరేషన్​ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

Pawan Kalyan Remuneration : అదేంటంటే.. పవన్ కల్యాణ్​ రీఎంట్రీ తర్వాత సినిమాల విషయంలో జోరు పెంచిన సంగతి తెలిసిందే. ఆయన చిత్రాలు కంటెంట్​తో సంబంధం లేకండా కేవలం ఫ్యాన్​ బేస్​ పైనే బాక్సాఫీస్​ మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. సూపర్ హిట్​గా నిలుస్తున్నాయి. దీంతో పవన్​తో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. రెమ్యునరేషన్​ కూడా భారీగా ఇస్తున్నారని తెలిసింది. అలా రీఎంట్రీలో ఆయన దాదాపు అత్యధికంగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు తీసుకున్నారని టాక్​ నడిచింది. ఈ క్రమంలోనే ఆయన రీసెంట్​గా ఒప్పుకున్న 'ఓజీ' సినిమాకు ఏకంగా రూ.75కోట్లు అందుకోబోతున్నారని ప్రచారం సాగింది. దీంతో టాలీవుడ్​లో అత్యధికంగా పారితోషికం తీసుకునే టాలీవుడ్​ హీరోల్లో పవన్​ కల్యాణ్​ జాయిన్​ అయిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ రెమ్యునరేషన్​ గురించి సోషల్​మీడియాలో మరో వార్త హల్​ చల్​ చేస్తుంది. ఆయన 'OG'కి తీసుకునేది రూ.75కోట్లు కాదని.. రూ.100కోట్ల వరకు తీసుకోబోతున్నారని అని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ కొత్త గాసిప్​ మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై పలు వైబ్​సైట్లు కథనాలు రాస్తున్నాయి.

Pawan Kalyan OG Movie Release Date : కాగా, ఈ సినిమా షూటింగ్​లో భాగంగా ఇప్పటికే కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఇందులో యాక్షన్​ సీక్వెన్స్​ కూడా ఉందట. అవుట్ ఫుట్ బాగా వచ్చిందట. త్వరలోనే మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మూవీటీమ్​ ప్లాన్ చేస్తోందట. ఆర్​ఆర్​ఆర్​ తర్వాత నిర్మాత డీవీవీ దానయ్య దీన్ని నిర్మిస్తున్నారు. సినిమా థియేట్రికల్​, నాన్​ థియేట్రికల్​ రైట్స్​కు మంచి ఆఫర్స్​ వస్తున్నాయట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని, ఫైనల్​ డీల్​ ఇంకా జరగలేదని అంటున్నారు. క్రిస్మస్​ కానుకగా చిత్రాన్ని రిలీజ్​ చేయాలని అనుకుంటున్నారట. ఈసినిమాలో పవన్‌ మూడు భిన్న వేరియేషన్స్​ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకటి టీనేజర్‌, రెండు కాలేజీ స్టూడెంట్‌, మూడు డాన్‌.. ఇలా మూడు వయసు గల పాత్రలలో కనిపించనున్నారట. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదీ చూడండి :

'పవన్​ కల్యాణ్​ అలా చేస్తారనుకోలేదు.. భోజనం చెయ్యమంటే..'

Pawan Kalyan Shoes Cost : పవన్ కల్యాణ్ 'బ్రో' షూస్​ అంతా కాస్ట్లీనా!

Last Updated : May 31, 2023, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.