ETV Bharat / entertainment

'మళ్లీ పెళ్లి' సినిమా.. పవిత్రా లోకేశ్​ రెమ్యునరేషన్​ అన్ని కోట్లా? - పవిత్ర నరేశ్​ మళ్లీ పెళ్లి

Pavitra Lokesh News : 'మళ్లీ పెళ్లి' సినిమా కోసం పవిత్రా లోకేశ్​ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం సోషల్​మీడియాలో హాట్​టాపిక్​గా మారింది.​ ఎంతంటే ?

Pavithra Lokesh Malli Pelli
Pavithra Lokesh Malli Pelli
author img

By

Published : May 27, 2023, 4:19 PM IST

Malli pelli : ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా చేసి ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు సీనియర్​ నటి పవిత్రా లోకేశ్​. అయితే ప్రస్తుతం ఈమె చిత్రసీమతో పాటు సోషల్​ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారారు. దానికి కారణం ఆమె సీనియర్ నటుడు నరేశ్​తో రిలేషన్​షిప్​లో ఉండటమే​. రీసెంట్​గా ఈ జంట కలిసి 'మళ్లీ పెళ్లి' సినిమలో నటించారు. ప్రేక్ష‌కులందరికీ తెలిసిన క‌థనే, రియల్​ లైఫ్​ న‌రేశ్‌-ప‌విత్ర‌ల రిలేషన్​షిప్​నే ఇందులోనూ చూపించారు. వాళ్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, సోషల్ మీడియాలో వీరిద్దరిపై వచ్చిన వార్తలు, అలా జరగడానికి గల కారణాల్ని.. ప్రేక్షకులకు చూపే ప్రయ‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు ఎం.ఎస్‌.రాజు.

Pavitra lokesh remuneration : శుక్రవారం రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్​ ముందు పర్వాలేదనిపించింది. అందరూ మళ్లీ నరేశ్​-పవిత్రా లోకేశ్​ గురించే చర్చించుకుంటున్నారు. అయితే వీటన్నింటి నడుమ ఇప్పుడు మరో విషయం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'మళ్లీ పెళ్లి' కోసం పవిత్ర లోకేశ్​ తీసుకున్న రెమ్యునరేషన్​ హాట్​టాపిక్​గా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా నటించిన సమయంలో పవిత్రా లోకేశ్..​ ఒక రోజుకు రూ.60 వేలు రెమ్యునరేషన్ తీసుకునేవారట. అయితే ఇప్పుడు ఆమె పారితోషికం రోజుకు రూ. లక్షకు పెరిగిందట. ఈ క్రమంలో మళ్లీ పెళ్లి కోసం దాదాపు రూ.10 కోట్ల మేర అందుకున్నారని గాసిప్ ఊపందుకుంది. అయితే, సినిమా ప్రమోషన్లలో భాగంగా.. ఈ చిత్రానికి మొత్తం అయిన ఖర్చే దాదాపు రూ. 15 కోట్లు అని నరేశ్​ వెల్లడించారు. ఈ క్రమంలో పవిత్రకు అంత మొత్తంలో రెమ్యునరేషన్​ ఉండదని.. అదంతా ఫేక్​ అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టాప్​ హీరోలకే ఆ స్థాయిలో పారితోషికం లేదని.. అవన్నీ వట్టి రూమర్లే అని కొట్టిపారేస్తున్నారు. ఈ విషయంపై పవిత్ర గాని చిత్రం బృందం గాని అధికారికంగా స్పందించలేదు.

Pavitra Lokesh Naresh Relationship : నరేశ్​- పవిత్ర లోకేశ్​ రిలేషన్​షిప్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం కూడా సాగుతోంది. సోషల్​ మీడియాలో వీరిపై విపరీతంగా ట్రోల్స్​ వచ్చినప్పటికీ.. అవేమి పట్టించుకోకుండా తమ రిలేషన్​లో ముందుకు సాగుతున్నారు. ఇక ఈ జంట 'సమ్మోహనం', 'హ్యాపీ వెడ్డింగ్', 'అంటే సుందరానికి', 'మిడిల్​ క్లాస్​ అబ్బాయి' లాంటి సినిమాల్లో స్క్రీన్​ షేర్​ చేసుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.