ETV Bharat / entertainment

Parineeti Chopra Raghav Chadha Wedding : గ్రాండ్​గా జరుగుతున్న పెళ్లి వేడుకలు.. వరుడి కోసం మామ స్పెషల్​గా ఏం చేశారంటే ? - పరిణీతి చోప్రా రాఘవ్​ చద్దా వెడ్డింగ్​ గెస్ట్స్

Parineeti Chopra Raghav Chadha Wedding :ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా, బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా ఆదివారం వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఉదయ్‌పుర్​లోని లీలా ప్యాలెస్‌ వేదికగా ఈ జంట ఒక్కటవ్వనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ప్రారంభమవ్వగా.. పెళ్లి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆ విశేషాలు మీ కోసం..

Parineeti Chopra Raghav Chadha Wedding
Parineeti Chopra Raghav Chadha Wedding
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 11:21 AM IST

Parineeti Chopra Raghav Chadha Wedding : బీటౌన్​ క్యూట్​ కపుల్​​ పరిణీతి చోప్రా - రాఘవ్​ చద్దా పెళ్లి పీటలెక్కనున్నారు. ఉదయ్​పుర్​లోని పిచోలా సరస్సు మధ్య ఉన్న లీలా ప్యాలెస్​ వేదికగా ఆదివారం ఈ జంట ఒక్కటవ్వనున్నారు. అంగరంగ వైభవంగా మొదలైన ఈ వివాహ వేడుకల కోసం శుక్రవారమే ఈ జంట ఉదయ్​పుర్​కు పయనమైంది. వీరి తర్వాత ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు. ఇక శనివారమే ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ప్రారంభమయ్యాయి. హల్దీ, సంగీత్​ వేడుకలు గ్రాండ్​గా జరిగాయి.

పంజాబీ స్టైల్​లో జరగనున్న ఈ వెడ్డింగ్​కు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు హాజరవ్వనున్నారు. 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్యాలెస్ నుంచి బారాత్​ ప్రారంభవ్వనుంది. దీని కోసం రాఘవ్​ ఓ బోట్​లో ఎక్కి, ప్యాలెస్​లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. పెళ్లిలో ఇది హైలైట్​గా నిలవనుందని టాక్​. ఆ తర్వాత 3:30 నుంచి ప్రారంభమవ్వమనున్న ఈ పెళ్లి వేడుక.. సాయంత్రం 6:30 గంటల వరకు జరగనుందని సమాచారం. ఆ తర్వాత గ్రాండ్​ రిసెప్షన్ జరగనుంది.

Parineeti Raghav Wedding Dress : ఈ జంట పెళ్లి దుస్తులను ఇద్దరు డిజైనర్లు రెడీ చేశారట. రాఘవ్ చద్దా మామ, ఫ్యాషన్ డిజైనర్ పవన్ సచ్‌దేవా, వరుడి కోసం అన్ని వివాహ దుస్తులను డిజైన్ చేయగా.. పెళ్లి కూతురు పరిణీతి మనీశ్​ మల్హోత్రా రూపొందించిన దస్తులను ధరించనుంది. బేసిక్ సాలిడ్ పాస్టెల్ కలర్ లెహంగా, స్టేట్‌మెంట్ జ్యువెలరీ స్పెషల్‌ లుక్‌లో పరిణీతి ఎట్రాక్షన్‌గా కనిపించనున్నారని టాక్‌.

Raghav Parineeti Wedding : మరోవైపు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ వివాహ వేడుక జరగనుంది. నో ఫోన్​ పాలసీని కూడా అమలు చేయనున్నారట. ఇక పెళ్లికి హాజరు కానున్న అతిథుల జాబితాలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారని సమాచారం. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, అశోక్ గెహ్లోత్​, భూపేశ్ బఘేల్ హాజరుకానున్నారట. వీరితో పాటు 200 మందికి పైగా గెస్ట్​లు ఈ వేడుకకు రానున్నారు.

గ్రాండ్​గా పరణీతి చోప్రా, రాఘవ్​ చద్ధా ఎంగేజ్​మెంట్​.. ఫొటోలు చూశారా!

పరిణీతి చోప్రా ఇల్లు గ్రాండ్​గా డెకరేట్​​.. ఇదంతా ఎంగేజ్​మెంట్​ కోసమేనా!..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.