ETV Bharat / entertainment

OTT సబ్‌స్క్రిప్షన్‌ లేదా?.. అయితే ఈ ఛానెళ్లలో ఆస్కార్ ఈవెంట్‌ను చూసేయండి! - ఆస్కార్​ అవార్డులు వార్తలుఆస్కార్​ అవార్డులు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్.. ఆస్కార్​ అవార్డుల వేడుక ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వేడుక స్ట్రీమింగ్​ అయ్యే ఓటీటీ సబ్​స్క్రిప్షన్​ లేదా?.. అయితే ఈ ఛానెళ్లలో ఆస్కార్స్‌ ఈవెంట్‌ను చూసేయండి.

oscars awards 2023
oscars awards 2023
author img

By

Published : Mar 12, 2023, 8:21 PM IST

మరికొన్ని గంటల్లో 95వ అకాడమీ అవార్డుల వేడుక జరుగనుంది. అమెరికా.. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్‌ వేడుకలకు అంతా సిద్దమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అవార్డుల వేడుక ఎప్పుడెప్పుడు మొదలవుతుందా..? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి భారత్‌ తరఫున తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌లో నాటు నాటు పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో ఫైనల్‌ నామినేషన్స్​లో నిలిచింది.

ఊరమాస్‌ బీట్‌తో నాటు నాటుగా ఆస్కార్‌ స్టేజ్‌పై మరోసారి ఇరగదీసి.. ఆర్‌ఆర్‌ఆర్‌ విజేతగా నిలవడం ఖాయమని ఈ సాంగ్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రతీ ఒక్కరూ విశ్వాసంతో ఉన్నారు. ఆస్కార్‌ వేడుకను చూద్దామనేవాళ్లు ఏఏ ప్లాట్‌ఫాంలలో చూడొచ్చనే దానిపై ఇంట్రెస్టింగ్‌ అప్డేట్ బయటకు వచ్చింది. ఆస్కార్‌ ఈవెంట్‌ పాపులర్‌ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలిసిందే. మీకు ఒకవేళ ఓటీటీ సబ్‌ స్క్రిప్షన్‌ లేకపోయినా.. లేదంటే స్ట్రీమింగ్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఈవెంట్‌ను మిస్సవుతామేమోనని దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆస్కార్‌ ఈవెంట్‌ టీవీలో కూడా వీక్షించవచ్చు.

ఓటీటీ అందుబాటులో లేనివాళ్లు స్టార్ కనెక్షన్‌ ఉంటే చాలు.. స్టార్ మూవీస్‌, స్టార్‌ మూవీస్‌ సెలెక్ట్‌, స్టార్ వరల్డ్‌, స్టార్ వరల్డ్‌ ప్రీమియర్ హెచ్‌డీ, స్టార్ వన్‌, స్టార్ ప్లస్‌, స్టార్ గోల్డ్‌, స్టార్ ఉత్సవ్‌, ఫాక్స్‌, ఫాక్స్‌ క్రైమ్​, విజయ్‌ టీవీ ఛానెళ్లలో కూడా ఆస్కార్‌ ఈవెంట్‌ను చూడొచ్చు. ఇంకేంటి మరి ఓటీటీ లేని వాళ్లు పై ఛానెళ్లలో మీ స్టార్ నెట్‌వర్క్‌కు అనుగుణంగా అందుబాటులో ఉన్న ఛానల్‌లో ఆస్కార్‌ ఈవెంట్‌ను వీక్షించొచ్చన్నమాట. మంగళవారం ఉదయం 5:30 గంటల నుంచి ఈవెంట్‌ స్ట్రీమింగ్ కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.